తుగ్లక్ పాలన బయటపడుతుందనే అసెంబ్లీలోకి మీడియాను అనుమతించడం లేదని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అసెంబ్లీలో మీడియాకు అనుమతించడకపోవడం వైకాపా అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. కొవిడ్‌ను అడ్డుపెట్టుకుని జగన్ తన తుగ్లక్ పాలనను దాచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలు, మద్యం షాపులకు అడ్డురాని కరోనా నిబంధనలు.. అసెంబ్లీలో మీడియా పాయింట్‌కు అడ్డువస్తున్నాయా అని నిలదీశారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియా అంటే వైకాపా ప్రభుత్వానికి ఎందుకు భయమని ప్రశ్నించారు. తన భాగోతం బయటపడుతుందనా..? లేక ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడుతూన్నారనా..? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.
ఇదీ చదవండీ...