సమాజానికి సేవ చేయాలంటే తెదేపా(tdp)ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(atchannaidu) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు(mahanadu 2021)లో సంస్థాగత నిర్మాణంపై అచ్చెన్న మాట్లాడారు. చంద్రబాబు(chandrababu) రాష్ట్రానికి తీసుకువచ్చిన మంచిపేరును.. జగన్ మోహన్‌రెడ్డి(ys jagan) నాశనం చేస్తున్నారని విమర్శించారు. మహానాడు పూరైన పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోసారి అరెస్ట్‌కు కూడా తాను సిద్ధమై పంచె, టీషర్టు సిద్ధం చేసుకున్నానని వ్యాఖ్యానించారు. స్వార్థం కోసం కొంతమంది నాయకులు పార్టీని వీడినా పటిష్టమైన కార్యకర్తల బలం ఉన్న తెదేపాకు ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
tdp mahanadu 2021: రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టుల పనులన్నీ ఆలస్యం: చంద్రబాబు