స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ప్రతి సంవత్సరం నిర్వహించే 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీ. ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, అవార్డుల విజేతలు.. ఆహ్వానితులుగా హాజరవుతుంటారు. ఈ సారికి కరోనా ప్రభావంతో వేడుక రద్దయింది.
ఇదీ చదవండి: