శాసనసభ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. సభ ముందుంచే అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో స్పీకర్ నిర్వహించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని 8వ తేదీ సాయంత్రం నిర్వహించనున్నారు. స్పీకర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు బీఏసీ సమావేశం జరుగనుంది. శాసనసభ నిర్వహణకు సంబంధించిన అంశాలను బీఏసీ ఆ సమావేశంలో చర్చించనుంది. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 11వ తేదీన కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. మద్య నిషేధ కార్యక్రమానికి సంబంధించి అదనపు రిటైల్ పన్ను విధింపు, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం తదితర అంశాలపై కేబినెట్లో చర్చించి శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చదవండి :