ETV Bharat / city

ఫర్నీచర్​ వ్యవహారం... అసెంబ్లీ చీఫ్​ మార్షల్​పై వేటు

అసెంబ్లీ ఫర్నీచర్‌ తరలింపు వ్యవహారం మీద అంతర్గత విచారణ కొనసాగుతోంది. శాసనసభ చీఫ్ మార్షల్‌ గణేశ్ బాబును ప్రభుత్వం బదిలీ చేసింది.

author img

By

Published : Aug 22, 2019, 10:25 PM IST

అసెంబ్లీ

శాసనసభ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అసెంబ్లీ చీఫ్ మార్షల్ వి.గణేష్​బాబుపై బదిలీ వేటు వేసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్​ ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాతృశాఖ ఆక్టోపస్​కు తిరిగి పంపిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని డీజీపీ తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆక్టోపస్ ఎస్పీకి గణేష్ రిపోర్టు చేశారు. ఆక్టోపస్​లో అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో ఉన్న గణేష్ బాబు చాలా కాలంగా శాసన సభ సచివాలయ చీఫ్ మార్షల్​గా బాధ్యతలు నిర్వహించారు.

అందుకే వేటు

మీడియాతో వైకాపా ఎమ్మెల్యే

శాసన సభాపతిగా ఉన్న సమయంలో కోడెల శివప్రసాద్ హైదరాబాద్​లోని అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్​ను తరలించారు. వెలగపూడికి కాకుండా కోడెల క్యాంపు కార్యాలయానికి ఫర్నీచర్​ను తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై ప్రస్తుత శాసన సభాపతి తమ్మినేని సీతారాం డీజీపీకి ఫిర్యాదు చేయగా.. కొద్ది రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. తరలింపు వ్యవహారంలో గణేష్ బాబు పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం వల్లే వేటు వేసినట్లు వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సహా అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుందని ఆయన అన్నారు. కోడెల కుమారుడికి చెందిన హీరోహోండా షో రూంలో ఫర్నీచర్ ఉంచి క్యాంపు కార్యాలయంలో ఉన్నట్లు తప్పుగా చెబుతున్నారని అన్నారు. ఈ ఉదంతం బయటకు వచ్చాకే కోడెల లేఖ రాసినట్లు నటించారని ఆరోపించారు. కోడెల కుటుంబం చేసిన అక్రమాలపై సిట్ లేదా సీబీసీఐడీతో దర్యాప్తునకు ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో అటవీ భూముల గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది అటవీ శాఖకు చెందిన భూములను డివిజన్లో ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని అటవీ అధికారులు గురువారం గిరిజనులకు ఖాళీ చేయాలని అధికారులు అనడంతో వివాదం చోటు చేసుకుంది

Body:మల్లం పేట రిజర్వ్ ఫారెస్ట్ లోని సుమారు 50 ఎకరాల భూములను గిరిజన ఆక్రమించుకున్నారు అని అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు బీట్ అధికారి దివాకర్ కొంతమంది సిబ్బంది వెళ్లి ఆయా సేద్యాన్ని అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 15 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటున్న తమకు హక్కులు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అటవీ అధికారులు అలా కుదరదు గిరిజనులకు ఆదేశాలిచ్చారు. కాళీ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Conclusion:ఈ భూములపై గతంలో కూడా వివాదాలు చోటు చేసుకు న్నాయి. అయినా అటవీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో తరచు అన్యాక్రాంతం గురవుతున్నాయి. సాగు చేసుకుంటున్న భూములు తమకే హక్కులు కల్పించాలని గిరిజనులు అంటే, అలా కుదరదు అని అటవీశాఖ అధికారులు అనడంతో ఈ వివాదం పరిష్కారానికి నోచుకోలేదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.