ETV Bharat / city

ఈనెల 27నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు - ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తాజా న్యూస్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈనెల 27నుంచి నిర్వహించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ సమావేశాలను నాలుగైదు రోజుల్లో ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఈనెల 27నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

author img

By

Published : Mar 21, 2020, 6:04 AM IST

ఈనెల 27నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ సమావేశాలను నాలుగైదు రోజుల్లో ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల వ్యయాల నిమిత్తం అసెంబ్లీ అనుమతి పొందేందుకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమావేశాల ప్రారంభం సందర్భంగా 27న గవర్నర్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి 28న ధన్యవాద తీర్మానం ఉంటుంది. అదే రోజు లేదా మరుసటి రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టడంపై నేడో రేపో ఖరారు చేయనున్నారు.

23న వైకాపా శాసనసభాపక్షం సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల పోలింగు సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈనెల 26న రాజ్యసభ ఎన్నికల పోలింగు నేపథ్యంలో 23న వైకాపా ఎమ్మెల్యేల కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో మాక్‌ పోలింగు నిర్వహించనున్నారు. పార్టీకి సంబంధించిన నలుగురు అభ్యర్థుల్లో ఎవరెవరికి ఏయే ఎమ్మెల్యే ఓటేయాలనేది నిర్ణయించి ఆ ఎమ్మెల్యేలను బృందాలుగా చేయనున్నారు. నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి 38 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఓటేస్తారని, నాలుగో అభ్యర్థికి 37మంది ఓటేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూను పాటించండి: సీఎం జగన్ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.