ETV Bharat / city

డ్రగ్​ మాఫియా డాన్​ స్టీఫెన్​ అరెస్ట్​.. 40 ఏళ్ల మత్తు దందాకు పోలీసుల చెక్​..

Drug Dealer Stephen Arrested: గోవా కేంద్రంగా సాగే మత్తు దందాలో కీలక వ్యక్తి. నాలుగు దశాబ్దాలుగా మత్తు వ్యాపారాన్ని నడిపిస్తోన్న సూత్రధారి. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ రవాణా చేస్తున్న.. జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా అలియాస్‌ స్టీవ్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సూత్రధారిని పట్టుకుని దేశవ్యాప్తంగా సాగుతున్న మత్తుదందాకు హైదరాబాద్ పోలీసులు చెక్‌ పెట్టారు.

Drug Dealer Stephen
డ్రగ్​ మాఫియా
author img

By

Published : Sep 24, 2022, 2:11 PM IST

డ్రగ్​ మాఫియా డాన్​ స్టీఫెన్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు

Drug Dealer Stephen Arrested: గోవా నుంచి దేశవ్యాప్తంగా సాగుతోన్న మత్తుదందాకు కారకుడైన సూత్రధారి.. జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా అలియాస్‌ స్టీవ్‌ను తెలంగాణ రాష్ట్ర పోలీసులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. గోవా బీచ్‌ల్లో మత్తుపదార్థాలు సరఫరా చేసే స్టీఫెన్‌ గోవాలో హిల్‌టాప్‌ హోటల్ యజమాని. 1983లో మత్తుపదార్థాలు సరఫరా చేసే ఏజెంట్ నుంచి ప్రస్తుతం దందా చేతిలోకి తీసుకునే స్థాయికి ఎదిగాడని పోలీసులు తెలిపారు.

బడా వ్యాపారులు, రాజకీయ నాయకులకు కోట్లల్లో అప్పులు ఇస్తుంటాడని వివరించారు. ప్రతి శుక్రవారం గోవాలో జరిగే ఫ్రైడే మార్కెట్‌, గోవా బజార్‌ పేరుతో విందులు, వినోద కార్యక్రమాలకు స్టీఫెన్‌ బృందం పర్యాటకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. పెద్దఎత్తున దేశ, విదేశీ పర్యాటకులు వచ్చినపుడు... డీజే పార్టీలు ఏర్పాటు చేయడంతోపాటు మాదకద్రవ్యాలు సరఫరా చేయిస్తాడని పోలీసులు తెలిపారు.

స్టీఫెన్‌ వద్ద వందలాది ఏజెంట్లు: పకడ్బందీగా మత్తు దందా సాగిస్తున్న స్టీఫెన్‌ వద్ద వందలాది మంది ఏజెంట్లు ఉన్నారని చెప్పారు. వీరి ద్వారానే గోవాకు వెళ్లే తెలుగురాష్ట్రాల యువకులు డ్రగ్స్‌కు బానిసలు కావడంతోపాటు సబ్‌ ఏజెంట్లుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు. ఆగస్టు 16న ప్రితేష్‌ నారాయణ బోర్కర్‌ హబ్సిగూడలో డ్రగ్స్‌ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 20 ఎక్స్‌టసీ మాత్రలు, 5 ఎల్​ఎస్​డీ బోల్ట్స్, 4 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

ఇతడి నుంచి సేకరించిన సమాచారంతో దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది మత్తు కొనుగోలుదారులను గుర్తించారు. వీరికి మత్తు పదార్థాలు విక్రయించిన వారిలో స్టీవ్, మంజూరు అహ్మద్‌లు కీలకసూత్రధారులు. బోర్కర్‌ ఇచ్చిన సమాచారం మేరకు హెచ్‌-న్యూ, ఓయూ పోలీసులు కలిసి గోవాకు వెళ్లి... కింగ్‌పిన్ స్టీవ్‌ను అరెస్ట్‌ చేశారు. స్టీఫెన్‌ అరెస్టు అనంతరం హైదరాబాద్‌ రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్​కు తీసుకొచ్చేందుకు పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, కొవిడ్‌ సోకిందంటూ న్యాయస్థానంలో స్టీఫెన్‌ కళ్లు తిరిగి పడిపోయినట్టు నాటకమాడాడు. ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించాక అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో నిందితుడిని విమానంలో హైదరాబాద్​కు తీసుకొచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.