ETV Bharat / city

New Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అక్కడే.. - Arrangements for Ministers Oath

New Cabinet Sworn: ఏపీలో కొత్త మంత్రి వర్గం కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 11న నూతన మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

New Cabinet Sworn
New Cabinet Sworn
author img

By

Published : Apr 8, 2022, 4:17 PM IST

Arrangements for Ministers Oath: కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి వేదిక సిద్ధమవుతోంది. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి.. సచివాలయ ప్రాంగణం వెలుపల అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత హైటీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

24 మంది మంత్రుల రాజీనామా : గురువారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో అధికారిక ఎజెండాపై చర్చించిన అనంతరం 24మంది కాబినెట్ అమాత్యులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు. రాజీనామా పత్రాలను సిద్ధం చేసేందుకు వీలుగా సమావేశానికి వచ్చేటపుడు మంత్రులంతా వారి వ్యక్తిగత లెటర్‌హెడ్‌లను తీసుకువచ్చి అధికారులకు అందజేశారు. ఆ లెటర్‌ హెడ్‌లపై ఆయా మంత్రులు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ అధికారులు టైప్‌ చేసి, తీసుకువచ్చారు. వాటిపై మంత్రులు సంతకాలు చేశారు. రాజీనామా సమర్పించిన మంత్రుల్లో అయిదుగురు లేదా ఆరుగురిని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి : 24 మంది మంత్రుల రాజీనామా.. ఈనెల 11న కొత్త కేబినెట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.