ETV Bharat / city

తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. రేపు మధ్యాహ్నానికి ఫలితం

author img

By

Published : Nov 9, 2020, 8:46 PM IST

యావత్​ తెలంగాణ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. పోలింగ్​ను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు... లెక్కింపును కూడా అదే విధంగా కొనసాగించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. రేపు మధ్యాహ్నానికి ఫలితం
తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. రేపు మధ్యాహ్నానికి ఫలితం

ఈ నెల 3న జరిగిన తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగలవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్​లో లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 850మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరికి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా లెక్కింపునకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు విజేత ఎవరో తేలనుంది.

8 గంటలకు లెక్కింపు ప్రారంభం

ఉదయం ఐదు గంటలకే లెక్కింపు సిబ్బంది కేంద్రానికి చేరుకోనున్నారు. ఫార్మలిటీస్ పూర్తి చేసిన అనంతరం 8గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి... అరగంటలో పూర్తిచేయనున్నారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణించనున్నారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి టేబుల్​కు ఒక మైక్రో అబ్జర్వర్​ను నియమించడం... ప్రక్రియను మొత్తం వీడియో తీయించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తికాగానే ఎన్నికల సంఘం వెబ్​సైట్​లో ఆ వివరాలు నమోదు చేయనున్నారు.

పోలీసుల భారీ భద్రత

గత అనుభవాల దృష్ట్యా లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. కౌంటింగ్ సెంటర్, పరిసరాలను ఏడు సెక్టార్లుగా విభజించారు. సిద్దిపేట పట్టణం, శివారు ప్రాంతాల్లో పది చోట్ల పోలీస్ పికెట్​లు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రం వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఫలితాల వెల్లడి తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ స్వయంగా బందోబస్తును పర్యవేక్షించనున్నారు.

ఇదీ చూడండి: వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.