జగన్ అక్రమాస్తుల కేసులపై హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. రాంకీ ఫార్మా కేసులో అభియోగాల నమోదుపై సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి వాదనలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారమే వ్యవహరించినట్లు ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అభియోగాల నమోదుపై జగతి పబ్లికేషన్స్ వాదనల కోసం విచారణను కోర్టు ఈనెల 12కి వాయిదా వేసింది.
ఇందూ టెక్‌జోన్ కేసులో తదుపరి విచారణ రోజున డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిందితుల జాబితాలోని భూమి రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయవాది ఇవాళ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. రాంకీ ఫార్మా, ఇందూ టెక్‌జోన్, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన ఛార్జ్షీట్లపై విచారణ ఈనెల 23కి వాయిదా పడింది. ఎమ్మార్ విల్లాల విక్రయాలకు సంబంధించిన సీబీఐ, ఈడీ పిటిషన్లపై విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... MP RRR: ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది: ఎంపీ రఘురామ