APSRTC BUS FARES : ప్రయాణికులకు తాత్కాలిక ఊరట కలిగించేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సు ఛార్జీలో 20శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏయే రూట్లలో ఎంతమేర బస్సు ఛార్జీ తగ్గించాలనే నిర్ణయాధికారాన్ని ఆర్టీసీ రీజినల్ మేనేజర్(ఆర్‌ఎం)లకు అప్పగించింది. దీంతో ఛార్జీల తగ్గింపుపై జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.
విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఎక్కువగా తిరిగే అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో టికెట్ ధరలో 10శాతం మేర తగ్గించినట్టు అధికారులు వెల్లడించారు. విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్, విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే వాటిలో 20శాతం ఛార్జీ తగ్గించారు. శుక్రవారం, ఆదివారం మినహా మిగతా రోజుల్లో మాత్రమే ఛార్జీల తగ్గింపు వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: