ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునికీకరించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని బస్సుల్లో రిజర్వేషన్ టికెట్ వ్యవస్థ అమలు చేయాలని యోచిస్తుంది. నగదురహిత, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. వినూత్న సేవలతో అధునాతన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఒకేసారి 50 వేల మంది సేవలు పొందేలా ఆర్టీసీ వెబ్‌సైట్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఆధునికీకరణ వల్ల ఈనెల 30న సర్వర్ తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 30న రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు ఆర్టీసీ వెబ్‌సైట్ సేవలు నిలిపివేయనున్నారు. ఆ సమయంలో టికెట్ బుకింగ్‌లు, రద్దు సౌకర్యం ఉండదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : 'ఎస్పీవై పరిశ్రమ గ్యాస్ లీక్ మృతుడి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి'