RTC EU On Employees Agitation: రేపట్నుంచి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొంటారని ఆర్టీసీలో ప్రధాన కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు సంఘం ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు లేఖ రాశారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఎసీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిందని లేఖలో తెలిపారు. జేఎసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటారని ఈయూ నేతలు తెలిపారు. రేపట్నుంచి దశల వారీగా జరిగే ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులంతా పాల్గొంటారని స్పష్టం చేశారు. ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ను ఆర్టీసీ ఎండీకి పంపినట్లు ఎంప్లాయిస్ యూనియన్ నేతలు తెలిపారు.
![ఈయూ రాసిన లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vja-55-06-rtc-eu-letter-to-md-av-3068069_06122021201910_0612f_1638802150_701.jpeg)
ఇదీ చదవండి
AP NGOs On Employees Protest: 'పీఆర్సీనే మా ప్రధాన డిమాండ్.. ఎస్మా ప్రయోగించినా వెనకడుగు వేయం'