రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తొలి రోజు రూ.71 లక్షల ఆదాయం వచ్చింది. గురువారం 1,483 సర్వీసులు తిరగగా ఆక్యుపెన్సీ రేట్ (ఓఆర్) 40 శాతంగా ఉంది. కొవిడ్ ప్రత్యేక సీట్లను పరిగణనలోకి తీసుకుంటే ఓఆర్ 64 శాతంగా ఉంది. మరోవైపు శుక్రవారం సర్వీసులను 1,316లకు తగ్గించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 169 నడిపితే.. గుంటూరు జిల్లాలో కేవలం 10 సర్వీసులే తిరిగాయి.
ఆర్టీసీలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది ఏప్రిల్ నెల జీతం చెల్లించాలని సంస్థ ఎండీ ఎం.ప్రతాప్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 90 శాతం జీతం చెల్లించాలంటూ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: