ETV Bharat / city

APPSC Written Exams for Jobs ఉద్యోగాల రాత పరీక్షల తేదీల వెల్లడి - ప్రభుత్వ ఉద్యోగాల రాత పరీక్షల షెడ్యూల్​

APPSC Written Exams for Jobs ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పలు ఉద్యోగాలకు నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరపాలని నిర్ణయించింది. అదనపు సమాచారం కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అభ్యర్థులకు సూచించింది.

APPSC
ఏపీపీఎస్సీ
author img

By

Published : Aug 30, 2022, 8:28 AM IST

APPSC Written Exams for Jobs గతంలో జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. గెజిటెడ్‌, నాన్‌-గెజిటెడ్‌ కేటగిరిలో కలిపి మొత్తం 17 నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలు ఇందులో ఉన్నాయి. తొమ్మిది నోటిఫికేషన్లకు సంబంధించిన ‘జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ’ పేపరును ఒకేరోజు (21.10.2022)న నిర్వహించబోతుంది. ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్‌ స్టడీస్‌(జీఎస్‌) పేపరును నవంబరు 7న, మరో నోటిఫికేషన్‌కు సంబంధించిన జీఎస్‌ పరీక్ష నవంబరు 9న నిర్వహించనున్నారు. పోస్టుల నేపథ్యానికి అనుగుణంగా సబ్జెక్టుల వారీగా పరీక్షలు వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. నోటిఫికేషన్లను గతంలో జారీ చేసినప్పటికీ తేదీలను ప్రకటించలేదు. వాటిని సోమవారం ఏపీపీఎస్సీ వెల్లడించింది.

గెజిటెడ్‌ పోస్టుల పరీక్షల షెడ్యూల్‌

* అక్టోబరు 19న మత్స్యాభివృద్ధి అధికారి పోస్టుకు ఉదయం పేపర్‌-2, మధ్యాహ్నం పేపర్‌-3 పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుకు పరీక్షలుంటాయి. ఉదయం పేపర్‌-1, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి.

* అక్టోబరు 20న పట్టు పరిశ్రమ అధికారి, ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. వీటికి సంబంధించి ఉదయం పేపర్‌-2, మధ్యాహ్నం పేపర్‌-3 పరీక్షలు జరుగుతుంది..

* ఉద్యానాధికారి పోస్టుకు అక్టోబరు 18న క్వాలిఫైయింగ్‌ పరీక్ష, 20న ఉదయం పేపర్‌-2, మధ్యాహ్నం పేపర్‌-3 పరీక్షలు ఉంటాయి.

* అక్టోబరు 21న మధ్యాహ్నం వ్యవసాయాధికారి, పోలీసు సర్వీస్‌లోని టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఏపీ సర్వే, భూ రికార్డుల సర్వీస్‌లోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయి.

* డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారి(వర్క్స్‌)- గ్రేడ్‌-2 పోస్టుకు నవంబరు 3న ఉదయం పేపర్‌-2, మధ్యాహ్నం పేపర్‌-3 పరీక్షలు నిర్వహించనున్నారు.

అక్టోబరు 21న జనరల్‌ స్టడీస్‌ పేపరు

అక్టోబర్‌ 21న ఉదయం మత్స్యాభివృద్ధి అధికారి, పట్టుపరిశ్రమ అధికారి, వ్యవసాయాధికారి, టెక్నికల్‌ అసిస్టెంట్‌, దేవాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఉద్యానశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఉద్యానాధికారి, సర్వే, భూ రికార్డుల సర్వీసుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్షలు ఉంటాయి.

* డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారి(వర్క్స్‌)-గ్రేడ్‌-2 పోస్టుకు సంబంధించి నవంబరు 7న ఉదయం జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది.

నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు...

* అక్టోబరు 19న ఉదయం ఆహార భద్రత అధికారి, నవంబరు 4న ఉదయం అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి, మధ్యాహ్నం అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ అధికారి పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు.

* నవంబరు 5న ఉదయం వసతి గృహ అధికారి-గ్రేడ్‌2 (మహిళలు) పోస్టుకు పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం ఏపీ శాసనసభ సర్వీస్‌ కింద తెలుగు రిపోర్టర్ల పోస్టుకు పరీక్ష ఉంటుంది.

* 6న జిల్లా పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి పోస్టుకు సంబంధించిన రా పరీక్షను ఉదయం పేపర్‌-2, మధ్యాహ్నం పేపర్‌-3 పరీక్ష నిర్వహిస్తారు.

* 7న మధ్యాహ్నం మహిళా శిశు సంక్షేమశాఖకు సంబంధించిన విస్తరణాధికారి(గ్రేడ్‌-1)(సూపర్‌వైజర్‌) పరీక్ష ఉంటుంది.

* అటవీ శాఖకు చెందిన అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుకు 9వ తేదీన క్వాలిఫైయింగ్‌ పరీక్ష, 10న ఉదయం పేపర్‌-2, మధ్యాహ్నం పేపర్‌-3, 11వ తేదీన ఉదయం పేపర్‌-4 పరీక్షలు ఉంటాయి.

నవంబరు 7న జనరల్‌ స్టడీస్‌

అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ అధికారి, వసతి గృహ అధికారి, తెలుగు రిపోర్టర్లు, జిల్లా పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి, విస్తరణాధికారి(గ్రేడ్‌-1) పోస్టులకు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష నవంబర్‌ 7న ఉదయం ఉంటుంది. నవంబరు 9న మధ్యాహ్నం అటవీశాఖ అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుకు, అక్టోబరు 21న ఉదయం ఆహార భద్రత అధికారి పోస్టుకు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ వివరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.