స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తుల లీజు, అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు కంపీటెంట్ అథారిటీ గా ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సీఎస్ అధ్యక్షతన ఐదుగురు ఉన్నత అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. సభ్యులుగా డీజీపీ, సీసీఎల్ఏ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించారు. కమిటీ కన్వీనర్‌గా సీఐడీ ఎడీజీ ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమం రీత్యా స్వాధీనం చేసుకున్న ఆస్తుల నుంచి ఆదాయం వచ్చేలా కమిటీ వీటిని పర్యవేక్షించనుంది.
ఇదీ చదవండి: