ETV Bharat / city

పట్టా భూముల్లో ఇసుక నాణ్యతపై ఆరా - ఏపీలో ఇసుక నాణ్యత వార్తలు

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ సరఫరా చేస్తున్న ఇసుక నాణ్యతపై అధికారుల బృందంతో పరిశీలన జరిపిస్తున్నారు. తన ఇంటికి నాణ్యత లేని ఇసుకను సరఫరా చేయటంపై మంత్రి పినిపే విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికారులు ఇసుక నాణ్యతపై దృష్టిపెట్టారు.

sand quality
sand quality
author img

By

Published : Jun 22, 2020, 6:19 AM IST

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కొన్నిచోట్ల సరఫరా చేస్తున్న ఇసుక నాణ్యంగా లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీనిపై అధికారుల బృందంతో పరిశీలన జరిపిస్తున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటి నిర్మాణం కోసం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండల పరిధిలో ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోగా, నాణ్యత లేనిది సరఫరా చేశారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇసుక నాణ్యతపై దృష్టిపెట్టారు. పట్టా భూముల నుంచి తెచ్చిన ఇసుక నాణ్యంగా ఉండటం లేదని ఎక్కువ మంది ఆరోపిస్తున్నారు. నదులకు ఆనుకొని రైతులకు చెందిన పట్టా భూముల్లో ఇసుక మేటలు ఉంటే వాటిని ఏపీఎండీసీ తవ్వి, తరలిస్తోంది. అక్కడ ఉండే మట్టిని సైతం ఇసుకతో కలిపి తవ్వుతున్నారు. దీంతో నాణ్యత లోపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక బృందం, ఇంజినీర్లతో ఈ వ్యవహారంపై పరిశీలన జరిపిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 9 పట్టా భూముల రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేసినట్లు అధికారులు తెలిపారు.

ఒకే రోజు మూడు లక్షల టన్నుల బుకింగ్‌
ప్రతి నిల్వ కేంద్రంలో ఉండే ఇసుకలో కొంత వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇటీవల ఇందులో మార్పులు చేశారు. ఆ నిల్వ కేంద్రంలో ఉండే ఇసుకను ఎంత మందైనా బుక్‌ చేసుకునే వీలు కల్పించారు. దీంతో రోజుకు సగటున 80 వేల నుంచి లక్ష టన్నుల ఇసుక బుక్‌ అవుతోంది. అనూహ్యంగా ఈ నెల 11న మూడు లక్ష టన్నులు బుక్‌ అయ్యింది. పరిమితి తొలగించడంతో అత్యధికంగా బుక్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బుక్‌ అవుతున్న ఇసుకలో మూడింట ఒక వంతు గ్రామ సచివాలయాల ద్వారా అవుతోంది. మరోవైపు ఏ నియోజకవర్గానికి చెందినవారు అదే పరిధిలో నిల్వ కేంద్రం నుంచి మాత్రమే ఇసుక తీసుకువెళ్లేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఓ నిల్వ కేంద్రాన్ని కేటాయించారు. కొన్ని రీచ్‌ల్లో బాగుండే ఇసుకను ఇతర ప్రాంతాలవారు నిత్యం బుక్‌ చేసుకొని తీసుకునే విధానానికి అడ్డుకట్ట వేసేందుకే ఇలా చేసినట్లు ఏపీఎండీసీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: భారత్​- చైనా సరిహద్దు సమస్యకు అసలు కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.