ETV Bharat / city

విద్యుత్ ఛార్జీలపై నేటి నుంచి అభిప్రాయ సేకరణ - విద్యుత్ టారిఫ్‌పై నేటి నుంచి అభిప్రాయ సేకరణ

విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కంలు) ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై(ఏఆర్ఆర్) రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) సోమవారం నుంచి ప్రజాభిప్రాయాలను స్వీకరించనుంది. కొవిడ్ నేపథ్యంలో ఆన్​లైన్ విధానంలో ఈ ప్రక్రియ చేపట్టనుంది.

electricity tariff
electricity tariff
author img

By

Published : Jan 17, 2021, 3:47 PM IST

Updated : Jan 18, 2021, 2:30 AM IST

విద్యుత్ ఛార్జీలపై(టారిఫ్)పై ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అభ్యంతరాలను వర్చువల్ విధానంలో స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఛైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ వెల్లడించారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై నివేదికలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించాయన్నారు. వీటిపై సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, సభ్యులు పి. రాజమోహన్ రెడ్డి, ఠాకూర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు(ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్)కు సంబంధించిన బహిరంగ విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచే జరుగుతాయని ఆమె వివరించారు.

  • ఫిర్యాదు ఎలా చేయాలంటే...?

ఈ సదస్సులు ఉదయం10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు... మళ్లీ రెండు గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయని నాగలక్ష్మి సెల్వరాజన్ వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్​కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. అభ్యంతరదారులు తమ పరిధిలోని విద్యుత్ సర్కిల్​, డివిజన్ కార్యాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనవచ్చని తెలిపారు. బహిరంగ విచారణను ప్రజలు http://www.eliveevents.com/apercpublichearing/ లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ!

Last Updated : Jan 18, 2021, 2:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.