ETV Bharat / city

APERC: విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల వసూలుపై ఏపీఈఆర్‌సీ పునఃసమీక్ష

విద్యుత్‌ వినియోగదారుల నుంచి అయిదేళ్ల కాలానికి రూ.3,669 కోట్ల ట్రూఅప్ ఛార్జీల వసూలుకు డిస్కంలకు అనుమతినిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని ఏపీఈఆర్​సీ సుమోటోగా నిర్ణయించింది. అప్పటివరకు గత ఆగస్టు 27న జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేసింది.

APERC
APERC
author img

By

Published : Oct 8, 2021, 1:16 PM IST

విద్యుత్‌ వినియోగదారుల నుంచి మూడో నియంత్రిత వ్యవధి (2014-15 నుంచి 2018-19) అయిదేళ్ల కాలానికి రూ.3,669 కోట్ల ట్రూఅప్‌ (సర్దుబాటు) ఛార్జీల వసూలుకు డిస్కంలకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈఆర్‌సీ) సుమోటోగా నిర్ణయించింది. అప్పటివరకు గత ఆగస్టు 27న జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేసింది.

గత ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు వినియోగదారుడు వినియోగించే విద్యుత్‌ ఆధారంగా సర్దుబాటు ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది. దీని ప్రకారం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జారీ చేసిన విద్యుత్‌ బిల్లుల్లో ట్రూఅప్‌ మొత్తాన్ని కలిపి డిస్కంలు వసూలుచేశాయి. ఏపీఈఆర్‌సీ నిర్ణయంతో మళ్లీ ఆదేశాలు వచ్చేవరకు ట్రూఅప్‌ ఛార్జీల వసూలును డిస్కంలు నిలిపివేయాల్సి ఉంటుంది. మరోవైపు డిస్కంలు దాఖలు చేసిన ట్రూఅప్‌ ఛార్జీల వసూలు పిటిషన్లపై ప్రజాభిప్రాయ సేకరణకు పబ్లిక్‌ నోటీసును ఏపీఈఆర్‌సీ వెబ్‌సైట్‌ ద్వారా జారీ చేసింది. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ క్లాజ్‌ 13(5) ప్రకారం ట్రూఅప్‌ వసూలుపై ప్రజాభిప్రాయ సేకరణకు పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఇదే విషయాన్ని పేర్కొంటూ కొందరు వినియోగదారులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించింది. కొత్తగా మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఎంత మొత్తానికి ట్రూఅప్‌ అనుమతించాలనే విషయాన్ని ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఇప్పటికే గత 2నెలల బిల్లుల్లో దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.794.84 కోట్లు, తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.158.18 కోట్లను వినియోగదారులనుంచి వసూలుచేశాయి. ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన ట్రూఅప్‌కు అనుమతించిన మొత్తంలో దీన్ని సర్దుబాటు చేస్తామని డిస్కంలు తెలిపాయి.

ఇదీ చదవండి

ప్రైవేటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో యాజమాన్య కోటా నిర్ణయం.. ఫీజు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.