ETV Bharat / city

'అగ్రవర్ణ పేదలకు ఉద్యోగ రిజర్వేషన్లు ఎప్పుడు?'

author img

By

Published : Aug 19, 2019, 5:38 PM IST

కేంద్రం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వలన అగ్రవర్ణ పేదలు నష్టపోతున్నారని ఆయన విమర్శించారు.

అగ్రవర్ణ పేదలకు ఉద్యోగ రిజర్వేషన్లు కేటాయించేదెప్పుడు? : తులసిరెడ్డి

అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లు వైకాపా ప్రభుత్వం విద్యా సంస్థలలో మాత్రమే అమలు చేస్తుంది తప్ప.. ఉద్యోగ నియామకాల్లో అమలు చేయకపోవడం శోచనీయమని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 1 లక్షా 31 వేల గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టుల్లో 27 వేల ఉద్యోగాలు ప్రభుత్వ నిర్వాకం వలన అగ్రవర్ణ పేదలకు రాలేదన్నారు. త్వరలో భర్తీకానున్న సచివాలయ పోస్టులలో 13 వేల ఉద్యోగాలు అగ్రవర్ణ పేదలకు రావాల్సి ఉంది..వాటి పరిస్థితేంటని ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేదలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు కేటాయించకుండా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

"అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలి"

Intro:AP_RJY_56_19_VIDYARDHULU_DARNA_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ప్రభుత్వం విడుదల చేయవలసిన ఉపకార వేతనాలు, వసతి గృహాల్లోని కాస్మోటిక్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు

Body:ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రావులపాలెంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం చేరుకున్నారు ప్రభుత్వం విడుదల చేయవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు

Conclusion:అనంతరం తహసిల్దార్ జిలానికి వినతిపత్రం అందించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.