కరోనా కట్టడిలో ప్రభుత్వానికి డాక్టర్‌గా సూచనలు చూసిన తనకు నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... మాస్కుల గురించి మాట్లాడితే సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి కానీ... ప్రశ్నించిన వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా పీపీఈ కిట్ల కొరత ఉందని... వాటిపై ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని నిలదీశారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. గతంలో చేసిన సూచనలు పాటిస్తే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండేవి కావన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: