అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామన్న వైకాపా...ఇప్పుడు ఈ ఊసే ఎత్తటం లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ఆదాయం తప్పా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితే లేకండా పోయిందని దుయ్యబట్టారు. కరోనా కాలంలోనూ మద్యం షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తున్నాయన్నారు. మద్యం బ్రాండ్ లు మార్చి ఇష్టారీతినా పేదల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: