అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకు......అమరావతికి ప్రజల నుంచి మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. 94 శాతం మంది అమరావతే ఏకైక రాజధాని కావాలని తమ ఓటుతో స్పష్టం చేశారు. రెండురోజుల వ్యవధిలో దాదాపు మూడున్నర లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఓటింగ్లో పాల్గొన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు www.apwithamaravati.com వెబ్ సైట్ ద్వారా ఈ ఆన్ లైన్ ఓటింగ్ విధానాన్ని ఈ నెల 24న అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరుదామని తాను విసిరిన సవాల్ ను ప్రభుత్వం స్వీకరించకపోవడంతో ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు.
ఇదీ చదవండి : సీబీఐ అధికారులపై మహిళా ఎస్సై గూఢచర్యం!