ETV Bharat / city

Contact RMP doctor: జ్వరం, దగ్గు, నీరసంగా ఉందా..అయితే ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించండి

:ఎవరికి ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా వెంటనే ఆసుపత్రి గుర్తుకు వస్తుంది. డబ్బు ఉన్న వాళ్లైయితే ప్రైవేటు ఆసుపత్రి వైపు వెళ్తారు.లేని వారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం పోతారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం జ్వరం, దగ్గు, నీరసంగా ఉంటే మీకు దగ్గర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు కాని, స్థానిక క్లినిక్‌కు కాని వెళ్లండని అంటున్నారు.

vijayawda govt hospital
vijayawda govt hospital
author img

By

Published : Feb 5, 2022, 10:00 AM IST

govt hospital board issue: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం కృష్ణా జిల్లావాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం నిత్యం వందలాదిగా వైద్యం కోసం తరలివస్తుంటారు. వివిధ రకాల వైద్యసేవలతో పాటు, రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి సైతం అందుబాటులో ఉంటుంది. ఈ ఆవరణంలో ఏర్పాటుచేసిన ప్రచార బోర్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జ్వరం, దగ్గు, నీరసంగా ఉంటే మీకు దగ్గర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు కాని, స్థానిక క్లినిక్‌కు కాని వెళ్లండి. చిన్నవాటికి అనవరంగా భయపడి పెద్దాసుపత్రికి రావద్దంటూ బోర్డును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు ఏర్పాటుచేశారు. ఆసుపత్రి సూపరింటెండ్‌ను వివరణ కోరితే తనకు తెలియదని, వెంటనే బోర్డు తొలగిస్తామని చెప్పడం గమనార్హం.

ఇదీ చదవండి: AP Govt To Impose ESMA: ఉద్యోగుల సమ్మెపై 'ఎస్మా' ప్రయోగించే యోచన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.