ETV Bharat / city

ఐదు నెలల్లో.. 20 కోట్ల పనిదినాలు వినియోగించేశారా? - ap new updates

ఉపాధి హామీ పథకం(నరేగా)లో భాగంగా... కేవలం ఐదు నెలల్లోనే 20 కోట్ల పనిదినాలను రాష్ట్ర ప్రజలు వినియోగించడం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువ సమయంలో ఇదెలా సాధ్యమైందంటూ కేంద్ర అధికారులు విస్మయపడుతున్నారు. రాష్ట్రంలో ఒకటి, రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తామని తెలిపారు.

ap-upadi-hami-workers-who-consumed-20-crore-working-days-in-5-months
5 నెలల్లో.. 20 కోట్ల పనిదినాలు వినియోగించేశారా?
author img

By

Published : Sep 6, 2021, 7:24 AM IST

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఈ ఏడాది స్వల్ప వ్యవధిలోనే అత్యధికంగా పని దినాలు వినియోగించడంపై కేంద్ర అధికారులు పరిశీలన చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వీరు విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి 20 కోట్ల పనిదినాలను కేటాయించింది. వీటిని కేవలం అయిదు నెలల్లోనే వినియోగించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిజంగానే ఈ స్థాయిలో వినియోగించుకున్నారా? క్షేత్రస్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే కోణంలో కేంద్ర అధికారులు పరిశీలించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కేంద్ర అధికారులు అడిగే సమాచారం అందుబాటులో ఉంచాలని, నరేగా అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన ఏడు రకాల దస్త్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

అదనంగా మరో 1.67 కోట్ల పనిదినాలు

నరేగాలో ఏటా కేటాయించే పనిదినాలను డిసెంబరులోగా పూర్తిగా వినియోగించుకొని అదనపు కేటాయింపుల కోసం రాష్ట్రాలు కేంద్రానికి మళ్లీ ప్రతిపాదిస్తుంటాయి. మిగతా మూడు నెలల (జనవరి- మార్చి) కాలానికి మరికొంత లేబర్‌ బడ్జెట్‌ను కేంద్రం కేటాయించడం రివాజు. 2021-22లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 20 కోట్ల పనిదినాలు ఆగస్టు నాటికే పూర్తిగా వినియోగించుకున్నట్లు రాష్ట్ర అధికారులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సమాచారమిచ్చారు. కూలీల పనులకు ఇబ్బంది లేకుండా అదనపు కేటాయింపులు చేయాలన్న విజ్ఞప్తిపై మరో 1.67 కోట్ల పనిదినాలను కేంద్రం కేటాయించింది. అదనపు కేటాయింపులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కోట్ల పనిదినాలు వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పనులకు హాజరవుతున్న మొత్తం 44,85,721 కుటుంబాల్లో ఇప్పటికే 3,10,980 కుటుంబాలు వంద రోజుల పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు తాజాగా సమాచారం పంపారు. ఒక్కో కూలీ సరాసరి రోజూ రూ.221.23 వేతనం పొందుతున్నారని పేర్కొన్నారు.

5 నెలల్లో.. 20 కోట్ల పనిదినాలువినియోగించేశారా?
నరేగా అమలులో ఈ ఏడాది కేటాయింపులు, వినియోగించుకున్న పనిదిమాల సంఖ్య

ఏ రాష్ట్రంలోనూ 75% దాటలేదు

కేంద్రం ఈ ఏడాది కేటాయించిన పని దినాలను దేశంలోని ఏ రాష్ట్రమూ ఇప్పటికీ పూర్తిగా వినియోగించుకోలేదు. నరేగా అమలులో ముందుండే రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా కేంద్ర కేటాయింపుల్లో 60 నుంచి 70 శాతమే వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అయిదు నెలల్లో 20 కోట్ల పనిదినాలు ఉపయోగించుకోవడం ఎలా సాధ్యమైందని కేంద్రం సందేహం వ్యక్తం చేస్తోంది. ఈ కోణంలో పరిశీలించేందుకే పనిదినాలు అత్యధికంగా వినియోగించుకున్న విశాఖ, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో కేంద్ర అధికారులు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు రోజులుగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమావేశాలు నిర్వహించి, దస్త్రాలు సిద్ధం చేయిస్తున్నారు. ఎక్కడా సందేహాలకు తావు లేకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు మస్టర్లలో ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాలో మాయజాలం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా స్థాయిలో కొందరు అధికారులు సహకరించడంతో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు కూడా రహస్యంగా విచారణ చేస్తున్నారని సమాచారం. పని దినాల వినియోగంపై భారీ లక్ష్యాలు నిర్దేశించడంతో జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కుమ్మక్కై వినియోగాన్ని ఎక్కువగా చూపించారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: మద్య నిషేధం హామీ గాలికి... ఆదాయాన్ని పెంచుకునేందుకు సర్కారు యత్నాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.