- ఈనాడు కథనాలతో విద్యార్థుల్లో ఉప్పొంగుతున్న దేశభక్తి..
నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థి దశలోనే వారి మనసుల్లో దేశభక్తిని నింపితే భవిష్యత్ మరింత ఉన్నతంగా మారుతుంది. స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడిన తీరు వారికి స్ఫూర్తినిస్తోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏడాది కాలంగా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ ఈనాడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 36 గంటలపాటు ఉక్కు సత్యాగ్రహ దీక్ష..
విశాఖ గాజువాక కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు, నిర్వాసితులు కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ్టి నుంచి 36 గంటలపాటు ఉక్కు సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gold medal ప్రపంచ ఫీల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కడప యువకుడికి పసిడి..
ప్రపంచ ఫీల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కడప యువకుడు సత్తా చాటాడు. ఆర్చరీ క్రీడాకారుడు ఉదయ్‌కుమార్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఎస్తోనియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఉదయ్‌కుమార్‌కు బంగార పతకం లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Pulichintala project పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు..
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ఇన్‌ఫ్లో 3.69, ఔట్‌ఫ్లో 3.44 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ దిగువన నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వతంత్ర భారతంలో మహిళల విజయ ప్రస్థానం..
ఆమె ఖ్యాతిగాంచని రంగం లేదు. సాధించని ప్రగతి లేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకుని విభిన్న వేదికలపై మహిళాలోకం వెలుగులీనుతోంది. స్వతంత్ర భారతంలో అతివల ప్రస్థానం ఆకాశమే హద్దుగా సాగుతోంది. వలసపాలన నుంచి విముక్తి పొందిన భారతావనిలో వనితాలోకం వడివడిగా పురోగమిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చనిపోయినట్టు నటించి చిరుతకు షాకిచ్చిన శునకం..
కర్ణాటక ఉడుపిలో ఇంటి బయట నిద్రిస్తున్న ఓ శునకం చిరుత దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. చిరుతతో విరోచితంగా పోరాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి మరణించినట్లు నటించింది. తద్వారా ప్రాణాలను కాపాడుకుంది. కుక్క మొరగడం వల్ల యజమాని బయటకు వచ్చి చూశారు. దీంతో చిరుత అక్కడినుంచి పరారయ్యింది. కుక్కకు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ సూపర్‌హిట్ దర్శకుడితో సినిమా చేస్తానంటున్న రౌడీ హీరో..
విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమా చేయాలనుందని అన్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. చెన్నైలో జరిగిన లైగర్ ప్రమోషన్ ఈవెంట్‌లో లోకేష్ కనకరాజ్‌పై విజయ్ ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా వ్యాక్సిన్ వేసుకోని జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో ఆడనున్నాడా..
కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన టెన్నిస్ స్టార్ జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లోనూ పోటీపడడం అనుమానంగా మారింది. అమెరికా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా జీవితమే ఓ ఆర్థిక మంత్రం..
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. మార్కెట్ అంటే పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో లేదో అన్న భయాలున్న భారత్‌కు పెట్టుబడి పాఠాలు నేర్పిన గురువు ఇక లేరు.. మార్కెట్‌లో డబ్బును ఎలా మదుపు చేయాలో సువర్ణ సూత్రాలను ఆయన లిఖించారు. మార్కెట్ కుంగిన సమయంలో పెట్టుబడికి వెనుకాడే చాలా మందిలోని భయాలను దూరం చేసి చూపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బస్సుపై చెరుకు లోడ్ పడి 13 మంది మృతి..
బస్సును లారీ ఢీ కొట్టిన ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.