- కాకినాడ గ్రామీణ మండలంలోని పరిశ్రమలో పేలుడు
కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పారిశ్రామిక వాడలోని ప్యారీ పంచదార శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘనటలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Godavari flood జలావాసంలో లంక గ్రామాలు, నిత్యావసరాల కోసం పడవల సాయం
గోదావరి వరదతో కోనసీమలోని లంక గ్రామాలు జలావాసం చేస్తున్నాయి. వరద ఉద్ధృతి తగ్గినా జలదిగ్బంధంలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. నిత్యావసరాల కోసం పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Tension in Palasa పలాసలో అర్ధరాత్రి ఉద్రిక్తత, ఎందుకంటే
Tension in Palasa శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీనివాస నగర్లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 27 వ వార్డులో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేసేందుకు సిద్దమైన రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఇచ్ఛాపురం తెదేపా ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాధితుల పక్షాన అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆయన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం,ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం,తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ, మద్యం సేవించి చేయి కోసుకున్న యువతి
బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పెట్టుకుని ఓ యువతి రోడ్డుపై వీరంగం సృష్టించింది. అనంతరం చేయి కోసుకుంది. గాయపడిన అమ్మాయిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రియుడితో భార్య పరార్, ముగ్గురు పిల్లలకు విషం తాగించి
భార్య ఇంటికి తిరిగి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతో పాటు ముగ్గురు పిల్లలకు కూడా విషం తాగించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తీవ్ర కరవు, ప్రజల నానా పాట్లు, వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్
China Severe Drought తీవ్ర కరవుతో చైనా ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద నది అయిన యాంగ్జీలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. దాంతో పాటు దేశంలో విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఫ్యాక్టరీలకు సైతం పూర్తిగా సెలవులిచ్చారు. చేసేదేమి లేక కృత్రిమ వర్షాలు కురిసేలా మేఘాలను ప్రేరేపించేందుకు చైనా అధికారులు రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ లక్ష కోట్లకు పసిడి దిగుమతులు
Gold Rate Today ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా తగ్గింది. మరోవైపు, దేశంలో ఏప్రిల్-జులై మధ్య పసిడి దిగుమతులు భారీగా పెరిగి దాదాపు రూ.1.02 లక్షల కోట్లకు చేరాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుంబ్లేకు పంజాబ్ షాక్, కొత్త కోచ్ కోసం ప్రయత్నాలు
టీమ్ఇండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ షాకివ్వనున్నట్లు సమాచారం. కోచ్‌గా అతడి స్థానంలో మరో క్రికెటర్‌కు ఆ బాధ్యతలను అప్పగించనుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆస్కార్‌కు ఆర్ఆర్ఆర్, శ్యామ్‌సింగరాయ్ నిజమేనా, అసలు ఈ రూల్స్ తెలుసా
Oscar nominations RRR Shyam singharoy అతిపెద్ద సినీ సంబరం ఆస్కార్ చిత్రోత్సవం. జీవితంలో ఒక్కసారైన ఈ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ప్రతిమను ముద్దాడాలని సినీ సెలబ్రిటీలకు ఉండే కల. అయితే ఈ మధ్యలో ఆర్ఆర్ఆర్ శ్యామ్‌సింగరాయ్ సినిమా.. ఆస్కార్ నామినేషన్స్‌లో ఎంపికయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజమెంత? అసలు ఆస్కార్ చరిత్ర ఏంటి? ఈ పురస్కారానికి నామినేట్ అవ్వాలంటే ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.