- పాఠశాలల్లో పుస్తకాల కొరత రానీయొద్దన్న ముఖ్యమంత్రి జగన్..
విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల డిజిటలైజేషన్, స్మార్ట్ టీవీ లేదా ఇంటరాక్టివ్ టీవీ ఏర్పాటు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గోరంట్ల మాధవ్ చేసిన ఘనకార్యానికి గుర్తుగా కార్లతో ర్యాలీ తీస్తారా..
ఇంపాక్ట్ ట్యాక్స్ పేరిట మరో బాదుడుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరలేపరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపారని, అది చాలదన్నట్టు ఇంపాక్ట్ ట్యాక్స్ విధిస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీలు..
రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు సందడిగా సాగుతున్నాయి. చిన్నా, పెద్దా, ఊరు, వాడ ఏకమయ్య మువ్వన్నెల జెండా చేతబట్టి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారుల అలరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కడప జిల్లాలో నడయాడిన మహాత్ముడు.. స్మరించుకుంటున్న స్థానికులు..
ఎందరో పోరాటయోధుల త్యాగఫలమే దేశానికి స్వాతంత్య్ర సిద్ధి. బ్రిటీష్ పాలకుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించిన మధుర జ్ఞాపకాలను స్వాతంత్య్ర సమరయోధులు స్మరించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫ్రీ విమాన టికెట్ అంటూ ఎర.. లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..
సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఇటీవల ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేరిట ఓ లింక్ వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోంది. ఫ్రీ విమాన టికెట్లంటూ ఎర వేస్తున్నారు. ఒకవేళ మీకూ అలాంటి లింక్ వచ్చిందా?.. అలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పొరపాటున లింక్ క్లిక్ చేశారో మీ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టినట్లే అవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కేంద్రం అలర్ట్.. ప్రజలు గుమిగూడొద్దంటూ..
భారత్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్ నియమాలను పాటించాలని ప్రజలను కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RakshaBandhan: తోబుట్టువులతో సినీ, క్రీడా తారలు.. సెలబ్రేషన్స్ సూపర్..
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఇంటి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఇళ్లలో జరిగిన రక్షాబంధన్ వేడుకలు జరిపి.. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచం అంతా ఓవైపు.. టీమ్ఇండియా మరోవైపు.. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడంటే?..
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెప్టెన్‌కు వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అద్దెపై 18% జీఎస్‌టీ అందరూ కట్టాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
అద్దెపై 18 శాతం జీఎస్‌టీ.. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన. ఇది అందరికీ వర్తిస్తుందా? నెలనెలా అద్దెతోపాటు జీఎస్‌టీ భారం కూడా తప్పదా?. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్‌పై దృష్టి..
లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది. త్వరలోనే యాంగ్ సామ్‌సంగ్ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.