ఎన్‌ఎస్‌ఎల్ కర్మాగారంలో అగ్నిప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం
పులివెందులలోని ఎన్‌ఎస్‌ఎల్ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 11.30 గంటల సమయంలో కర్మాగారం గోదాములో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పోలీసులు.. వైకాపా పాలనలో దిగజారిపోతున్నారు: చంద్రబాబు
శంలోనే ఒకప్పుడు పేరున్న ఏపీ పోలీసులు.. వైకాపా ప్రభుత్వంలో రోజురోజుకూ దిగజారి పోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ.. కుప్పంలో చేపట్టిన నిరసనల సందర్భంగా దేశాన్ని కాల్చండంటూ..ఒక సీఐ వ్యాఖ్యలు చేయడాన్ని డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఉమ్మడి నోటిఫికేషన్లతో ఉద్యోగాల భర్తీ!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో తొలిసారిగా ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా పారా మెడికల్ నియామకాలు జరుగుతున్నాయి. ఈ శాఖలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధానపరిషత్ (ఏపీవీవీపీ) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఉండే పోస్టులకు హెచ్‌ఓడీ కార్యాలయాలు గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేసేవి. ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం ఒకే నోటిఫికేషన్‌తో మూడు విభాగాల్లో పోస్టులకు అర్హులవుతారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ.. తుది దశ సమాచార సేకరణలో స్వల్ప జాప్యం
ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగంలో చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తింది. నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏడేళ్ల వయసులో బాలిక మాయం.. 9 సంవత్సరాల తర్వాత కిడ్నాపర్ దొరికాడిలా...
తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలిక ఆచూకీని గుర్తించారు పోలీసులు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎద్దులు హల్చల్.. ఘర్షణ పడి బైక్‌ను ఢీ.. దూసుకొచ్చిన కారు..
పంజాబ్ బర్నాలా నగరంలో రహదారిపై పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. తాజాగా హందియాయా రహదారిపై రెండు ఎద్దులు ఘర్షణ పడి.. రోడ్డుపైకి దూసుకొచ్చాయి. దీంతో రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పశువులు ఢీకొట్టగానే బైక్‌తో సహా వెళ్లి పక్కనుంచి వెళ్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ఘటన సీసీటీవీలో నమోదైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
గాజాపై బాంబుల వర్షం తీవ్రం.. ఇద్దరు పీజేఐ నేతలు హతం.. 28కి చేరిన మృతులు
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. శుక్రవారం గాజాపై వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్.. శనివారమూ భీకరంగా విరుచుకుపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
అద్దెకు ఉండాలా? ఇల్లు కొనాలా? ఏది బెటర్?
ఏళ్ల తరబడి అద్దె ఇంట్లోనే ఉండాలా? లేక రుణం తీసుకుని ఇల్లు కొనాలా? అనేక మందిని వేధించే ప్రశ్నకు సమాధానమే ఈ కథనం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
యుద్ధనౌకపై మోహన్‌లాల్... హీరోగా కాదు.. రియల్ లైఫ్ 'లెఫ్టినెంట్ కర్నల్'గా
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొచిన్ షిప్‌యార్డ్‌లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్(ఐఏసీ) విక్రాంత్‌ను సందర్శించారు. ఆ వివరాలు...పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
పంత్‌పై రోహిత్ ఫైర్.. ఎందుకంటే?
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 విజయంలో పంత్ కీలక పాత్ర పోషించిన వికెట్‌కీపర్ పంత్‌పై కెప్టెన్ రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.