ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ టాప్ న్యూస్

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Aug 2, 2022, 9:03 PM IST

  • అచ్యుతాపురం సెజ్‌లో విష వాయువు లీక్.. 50 మంది మహిళా ఉద్యోగులకు అస్వస్థత
    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్​లో (Atchutapuram SEZ) విషవాయువు లీకై (Poison gas leak) 50 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • భూవివాదాల పరిష్కారానికి ప్రతి మండల కేంద్రంలో ట్రైబ్యునల్‌: సీఎం జగన్
    ప్రతి మండల కేంద్రంలో భూవివాదాల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేలో వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. వ్యక్తిగతంగా భూమి సర్వే కోసం దరఖాస్తు చేస్తే కచ్చితంగా చేయాలని.., నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • సెక్యూరిటీ బాండ్ల వేలం.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్లు అప్పు
    రాష్ట్రప్రభుత్వం ఇవాళ మరో రూ.2 వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ రుణాన్ని పొందింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • జగన్​ ప్రభుత్వానికి అంతం పలుకుతాం: బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు
    తిరుపతిలో భారతీయ జనతా యువ మోర్చా యువ సంఘర్షణ యాత్రను బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రారంభించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే యాత్ర చేపట్టినట్లు తెలిపారు. యువ సంఘర్షణ యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రేపే 'తిరంగా బైక్ ర్యాలీ'.. అన్ని పార్టీల ఎంపీలు కలిసికట్టుగా..
    దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరగనున్న 'తిరంగా బైక్​ ర్యాలీ'లో అన్ని పార్టీల ఎంపీలు పాల్గొనాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'మంకీపాక్స్​పై ఆందోళన వద్దు.. వ్యాక్సిన్​పైనా ముందడుగు'
    మంకీపాక్స్ విషయంలో దేశ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. వ్యాక్సిన్ విషయంలోనూ చకచకా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • సముద్రంలో చైనా సరికొత్త అస్త్రం.. టార్గెట్​ ఆంధ్ర, కేరళ!
    చైనాకు చెందిన నిఘా నౌక 'యువాన్ వాంగ్​ 5'.. శ్రీలంకలోని హంబన్​టొట నౌకాశ్రయం వైపు వెళ్తోంది. అయితే ఈ నౌక 750 కిలోమీటర్లకు పైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా భారత్​లోని కల్పక్కం, కూడంకుళం సహా అణు పరిశోధనా కేంద్రాలు దీని పరిధిలో వస్తాయి. అలాగే ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. చైనా నౌక విషయమై కేంద్ర ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి తన ఆందోళనను తెలియజేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • దిగ్గజ సంస్థల చూపు భారత్​వైపు.. భారీగా పెట్టుబడులు!
    ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగుతోంది. ద్రవ్యోల్బణంతో అమెరికా.. స్థిరాస్తి సంక్షోభంతో చైనా అతలాకుతలమవుతున్న వేళ.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్​ మంచి వృద్ధి రేటు సాధిస్తుందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్​లో పెట్టుబడులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • సెక్స్​ గురించి కరణ్ ప్రశ్న.. నటి దీటైన రిప్లై.. పంచ్​లతో ఆమిర్ సందడి
    కాఫీ విత్ కరణ్​ షోకు విచ్చేసిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్.. కరణ్​ను ఓ ఆట ఆడుకున్నారు. పంచ్​లు, సెటైర్లు వేస్తూ ఆద్యంతం సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మీరూ ఓసారి చూసేయండి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కామన్​వెల్త్​లో ఘనమైన చరిత్ర.. భారత్ సుదీర్ఘ ప్రయాణం ఇలా...
    కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే నాలుగు స్వర్ణాలు భారత్ వశమయ్యాయి. టోర్నీ ముగిసేలోపు మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, భారత్​కు కామన్​వెల్త్​ క్రీడల్లో ఘనమైన చరిత్రే ఉంది. ఇప్పటివరకు ఈ క్రీడల్లో మన ప్రయాణం ఎలా ఉందంటే..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.