- ముద్దుల మావయ్యకు బాధ్యత లేదు.. ప్రజల గొంతునవుతా : పవన్
అధికారంలో లేకున్నా.. ప్రజల సమస్యల పట్ల తాము బాధ్యతాయుతంగా ఉన్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విజయవాడలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్.. ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు సుదీర్ఘంగా వినతులు తీసుకున్నారు. - "జనంతో.. జనసేనాని" అర్జీలు స్వీకరించిన పవన్!
విజయవాడలో జనవాణి కార్యక్రమం ప్రారంభించిన పవన్.. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. నేతలు అధికారం ఉంటేనే సమస్యల పరిష్కారం అంటే కుదరదన్నారు. పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారిస్తామన్నారు. - "వీరుడా.. అందుకో మా జోహార్లు"..ఆకట్టుకుంటున్న అల్లూరి సైకత శిల్పం
'వీరుడా.. అందుకో మా జోహార్లు' అన్న నినాదంతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలు సోహిత, ధన్యతలతో కలిసి రూపొందించిన అల్లూరి సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. విప్లవవీరుడు అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని సైకత శిల్పం ఏర్పాటు చేశారు. - తనువు చాలించి.. నలుగురికి ప్రాణదాతగా నిలిచిన చరిత
ఓ బాలింత తన ప్రాణాన్ని త్యాగం చేసి నలుగురికి ప్రాణదాతగా మారింది. తెలంగాణకు చెందిన ఓ మహిళ.. తన మొదటి ప్రసవంలో కుమారుడికి జన్మనిచ్చారు. తర్వాత కొన్నిరోజులకు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మహిళను కర్నూలులోని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో వారి కుటుంబసభ్యులు.. ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. - "తెలంగాణ వంటకాలేందో జర చెప్పుండ్రి.." స్వయంగా పరిశీలించిన ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులకు.. వడ్డించే వంటకాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. కొన్ని వంటలను టేస్ట్ కూడా చేశారు. మరికొన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు. - సీఎం ఇంట్లోకి ఆగంతుకుడు.. అర్ధరాత్రి గోడ ఎక్కి.. రాత్రంతా...
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రి నివాసంలోకి ఆగంతుకుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి గోడ ఎక్కి తెల్లారేవరకు అక్కడే కూర్చున్నాడు. ఈ భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యారు. - రష్యా అధీనంలోకి మరో నగరం.. డాన్‌బాస్‌పై గురి!
ఉక్రెయిన్ లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని లిసిచాన్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. ఈ విజయంతో డాన్‌బాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న.. తమ లక్ష్యానికి మరింత చేరువైనట్లు చెప్పారు. - ఈ పోస్టాఫీస్ పొదుపు పథకాలు తెలుసా? వడ్డీ రేటు 7% పైనే!
రిజర్వ్ బ్యాంకు రెపో రేటును పెంచిన తర్వాత.. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయినా కూడా మంచి రాబడిని అందించలేకపోతున్నాయని అంటున్నారు నిపుణులు. వీటితో పోలిస్తే.. పోస్టాఫీస్ పథకాలు కొన్ని లాభదాయకంగా ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో చూడండి. - లాయర్ అవతారం ఎత్తిన కీర్తి సురేశ్.. ఆసక్తికర కథతో అక్కినేని హీరో కొత్త సినిమా!
రాఘవ లారెన్స్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రుడు'. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. మరోవైపు స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ లాయర్‌గా ప్రేక్షకులను పలకరించనుంది. వీటితో మరికొన్ని అప్డేట్స్ ఏమున్నాయంటే.. - కోహ్లీ స్లెడ్జింగ్.. బెయిర్ స్టోతో వాగ్వాదం
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. బెయిర్‌స్టోతో వాగ్వివాదానికి దిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @7PM - ఏపీ ప్రధాన వార్తలు
.
ఏపీ ప్రధాన వార్తలు