- Jagan New Cabinet: కొలువుదీరిన జగన్ కొత్త టీం
ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..
కొత్త కేబినెట్‌లోని మంత్రులకు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. గత కేబినెట్ తరహాలోనే అయిదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉపముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రం వేసిన జగన్.. కూల్ అయిపోయిన బాలినేని..!
బాలినేని బుజ్జగింపుల పర్వం ముగిసింది. మంత్రివర్గంలో స్థానం దక్కనందుకు నిన్నటి నుంచీ అసంతృప్తితో రగిలిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు శాంతించారు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు తన ఆగ్రహాన్ని మౌనంగానే వ్యక్తపరిచిన బాలినేని.. చిట్ట చివరకు దిగివచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అవసరమైతే పస్తులుంటాం కానీ.. బీసీలెవ్వరూ ఆత్మాభిమానాన్ని చంపుకోరు'
ముఖ్యమంత్రి జగన్.. బీసీలను అన్ని విధాలా మోసంచేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. తెదేపా హయాంలో బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని.. బలహీనవర్గాల నిధులను దారిమళ్లించిన ఘనత వైకాపాకే దక్కుతుందన్నారు. అవసరమైతే పస్తులుంటాం తప్పా.. ఆత్మాభిమానాన్ని చంపుకుని బీసీలెవ్వరూ జగన్‌కు దాసోహం అనరని స్పష్టం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ సెల్ సమావేశం జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- KCR DEADLINE: కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్‌లైన్
దిల్లీ తెలంగాణ భవన్ వద్ద చేపట్టిన తెరాస నిరసన దీక్షలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో భాజపా నేతలను విమర్శించారు. రాష్ట్ర భాజపా నేతలు తనను జైలుకు పంపుతామని అంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి.. అంటూ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో 24 గంటల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్‌కు షాక్.. ఖర్గేను ప్రశ్నించిన ఈడీ.. 'అగస్టా కేసు'లో వారికి నోటీసులు
రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనకు సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్‌కు న్యాయస్థానం నోటీసులు పంపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్- ఇమ్రాన్ పార్టీ సభ్యుల రాజీనామా
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈయన ఎంపిక జరిగింది. విపక్షాలన్నీ ఏకగ్రీవంగా షెహబాజ్‌కు మద్దతు తెలిపాయి. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి వాకౌట్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- హెల్త్ పాలసీ తీసుకుంటున్నారా? అయితే ఇవి తప్పనిసరిగా పాటించండి
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటేనే ఆరోగ్య బీమా పాలసీలు పరిహారం ఇచ్చేవి. మారిన వైద్య విధానంతో ఇప్పుడు ఎన్నో చికిత్సలు ఆసుపత్రిలో చేరకుండానే పూర్తవుతున్నాయి. దీంతో ఈ పాలసీలను ఎంచుకునేటప్పుడు ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఓపీడీ) చికిత్సలకూ వర్తిస్తుందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ వారమే 'బీస్ట్', 'కేజీఎఫ్-2'.. ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే?
సినిమాకు సంబంధించి సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ అంటే వేసవి కాలమే. అందుకే ఈ సమయంలోనే చిత్రాలు అధిక సంఖ్యలో విడుదలవుతుంటాయి. ఇప్పటికే 'రాధేశ్యామ్', 'ఆర్‌ఆర్‌ఆర్', 'గని' తదితర సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. మరికొన్ని ఈ వారం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సందడి చేయనున్నాయి. వాటిలో 'ఆర్‌ఆర్‌ఆర్', 'బీస్ట్' కూడా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో ఓసారి చూద్దాం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Ravi Shastri: 'చెన్నై కెప్టెన్‌గా అతడిని నియమించాల్సింది'
ఐపీఎల్ 2022లో వరుస ఓటములతో అభిమానులను నిరూత్సపరుస్తోంది డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌తోనే సారథిగా తప్పుకొన్న ధోనీ.. జట్టు పగ్గాలను జడేజాకు అప్పగించాడు. అయితే కెప్టెన్సీ మార్పు ఫలితాన్ని ఇవ్వకపోవడం పట్ల టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM - ఏపీ టాప్ వార్తలు
.
ఏపీ ప్రధాన వార్తలు