- TDP MP Rammohan Naidu: "ఏపీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోంది"
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందని తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.
- సభలో చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది: లోకేశ్
జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తమ పార్టీ నాటు సారా మరణాలపై సభలో చర్చకు పట్టుబట్టినా..ప్రభుత్వం మాత్రం తప్పించుకు తిరుగుతోందని ధ్వజమెత్తారు.
- Viveka Murder case : సీబీఐ వేసిన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గంగిరెడ్డి బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని.. సీబీఐ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసం సీబీఐ వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేసింది.
- కర్నూలు నగరపాలకసంస్థ సిబ్బంది నిర్వాకం.. చెత్తపన్ను కట్టలేదని దుకాణాల ముందు చెత్త
చెత్తపన్ను చెల్లించడంలేదని కర్నూలు నగర పాలక సిబ్బంది వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని అనంత కాంప్లెక్స్ వద్ద ఉన్న బట్టల షాపు యజమానులు చెత్తపన్ను కట్టలేదని ఓ ట్రాక్టర్ చెత్తను తీసుకొచ్చి షాప్ ముందు వేసి వెళ్లారు. దీంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
- ఫేస్‌బుక్‌పై సోనియా, రాహుల్ ఫైర్.. డెమొక్రసీకి డేంజర్ అంటూ..
ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు దేశ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ప్రచారాల విషయంలో ఫేస్బుక్ పక్షపాతం వహిస్తోందని లోక్‌సభలో పేర్కొన్నారు.
- పర్యటకులకు గుడ్‌న్యూస్.. ఈ-టూరిస్ట్ వీసాలపై నిషేధం ఎత్తివేత
156 దేశాల పౌరులకు జారీ చేసే ఈ-టూరిస్ట్ వీసాలను కేంద్రం పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం వీటిపై నిషేధం విధించింది. ఈ-టూరిస్ట్ వీసాలతో పాటు అన్ని దేశాల పౌరుల సాధారణ వీసాలు, అమెరికా- జపాన్ దేశాల పౌరులకు పదేళ్ల పర్యటక వీసాలపై ఆంక్షలు తొలగిస్తున్నామని తెలిపింది. కొత్త వీసాలు సైతం జారీ చేయడం ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది.
- భారత్- రష్యా చమురు ఒప్పందం.. అమెరికా ఏమందంటే?
రష్యాతో భారత్ చమురు ఒప్పందం కుదుర్చుకుంటే ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదని అమెరికా తెలిపింది. అయితే చరిత్రలో భారత్ తప్పుడు వైపు ఉండొచ్చని హెచ్చరించింది.
- బుల్ జోరు... సెన్సెక్స్ 1000 ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1040 పాయింట్లకు పైగా వృద్ధి చెందగా.. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకింది.
- నేను ఆ నటులతోనే వర్క్ చేయాలనుకుంటాను: రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ హిందీ యాంకర్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన పాత సినిమాలపై సెటైర్లు వేశారు. దానికి మన స్టార్స్ నవ్వులు పూయిస్తూ సమాధానం చెప్పారు. ఇందులో భాగంగానే తన సినిమాలో నటించాల్సిన యాక్టర్స్‌కు ఎలాంటి క్వాలిటీస్ కావాలో చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఇంకా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు.
- IPL 2022: మరోసారి సీఎస్కే కప్పు గెలిచేనా..?
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా.. అత్యధిక అభిమానులు గల జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ పేరు సంపాదించుకుంది. లీగ్ చరిత్రలోనే రెండో విజయవంతమైన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది. మార్చి 26న ఐపీఎల్ 2022 మహా సంగ్రామం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలాలు, బలహీనతలను ఓ సారి పరిశీలిద్దాం.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ఏపీ ప్రధాన వార్తలు
.
AP TOP NEWS