- ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌పై విచారణ.. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు నోటీసులు
- గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూకేటాయింపుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. సీఆర్డీఏ నిబంధనలు ఉల్లంఘిస్తూ తెదేపాకు భూమిని కేటాయించారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భక్తులకు అందుబాటులో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
- నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. వీటిని తితిదే వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
- వైఎస్సార్ రెండో విడత రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కొత్త జిల్లాల ఏర్పాటుపై.. జనవరి 26న ప్రకటన: కోన రఘుపతి
- రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి తెలిపారు. మెుత్తం 26 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మరికొన్ని గంటల్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
- ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మరి కొన్ని గంటల్లో జరగనుంది. పైడితల్లి సిరిమానోత్సవం రాష్ట్ర పండుగగా జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- హిజ్బుల్ చీఫ్ సహా 18 మందిపై 'ఉగ్ర'ముద్ర
- హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ సహా పాకిస్థాన్‌కు చెందిన 18 మందిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. యూఏపీఏ కింద ఈ చర్యలు తీసుకుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- హరియాణాలో ఘోరం- పట్టపగలే యువతిపై కాల్పులు
- పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువతిని తుపాకీతో కాల్చాడు ఓ వ్యక్తి. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయిన ఘటన హరియాణాలో జరిగింది. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బైకర్పై ఏనుగు దాడి- త్రుటిలో తప్పిన ముప్పు
- ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులపై ఏనుగు దాడి చేయబోయింది. అయితే బైక్ వేగం పెంచి గజరాజుకు దొరక్కుండా పక్క నుంచి వెళ్లిపోవడం వల్ల త్రుటిలో తప్పించుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'నేను రిటైర్ అవ్వడం వారికి ఇష్టం లేదు'
- జట్టులోని యువ ఆటగాళ్లు తనను రిటైర్ కావొద్దని కోరుతున్నారని క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ తెలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, కోల్‌కతాపై విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఇది తెలిసే సరికి సగం జీవితం అయిపోయింది'
- ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్రాష్ బ్యాగ్స్‌పై 'పూరి మ్యూజింగ్స్'లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మన చుట్టూ ఉండే చెత్తను గుర్తించాలన్నారు. సగం చెత్త మనుషుల రూపంలో ఉంటుందన్నారు. ఈ విషయం తెలిసే సరికే సగం జీవితం అయిపోయిందని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి