- "మహిళలకు రక్షణ కల్పించటంలో విఫలం".. సీఎం జగన్‌కు చంద్రబాబు ఘాటు లేఖ
మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాసిన చంద్రబాబు.. మహిళలపై హింస పెరిగేందుకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- నేనెవరికీ దత్తున్ని కాదు.. సొంతవాళ్లున్నారు : పవన్
కౌలు రైతు సమస్యలపై మాట్లాడుతుంటే..వైకాపా నేతలు తనను దత్తపుత్రుడు అని అంటున్నారని జనసేన అధినేత పవన్ అన్నారు. ఏలూరు జిల్లా చింతపులపూడిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన పవన్.. ఎవరెన్నిసార్లు అలా అన్నా తాను మాత్రం మర్యాదగా మాట్లాడానని తెలిపారు. ఇంకొకసారి తనను దత్తపుత్రుడు అని అంటే మాత్రం ఊరుకునేది లేదని..,ఇలాగే కొనసాగితే సీఎం జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుందని హెచ్చరించారు.
- Amaravathi Capital: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభం
హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలలో పనులు ప్రారంభించారు. పనులు చేసేందుకు వచ్చిన కూలీలకు అమరావతి రైతులు గులాబీలు ఇచ్చి స్వాగతం పలికారు.
- స్ట్రాటజిస్టుల అవసరం భాజపాకు లేదు : జీవీఎల్
Union Minsters Visit in AP: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రులు పర్యటించానున్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో భాజపా సమర్థవంతంగా ఉందన్నారు. స్ట్రాటజిస్టుల అవసరం భాజపాకు లేదని ఎద్దేవా చేశారు.
- ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడిన మహిళ- అదృష్టం కొద్దీ..
ఓ మహిళ మ్యాన్‌హోల్‌లో పడిన ఘటన బిహార్‌లోని పట్నాలో గురువారం(ఏప్రిల్ 21) జరిగింది. అలమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిన బాధితురాలు రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది.
- వృద్ధ దంపతులను నరికి చంపిన బంధువులు.. ఆ అనుమానంతో!
చేతబడి చేశారన్న కారణంతో వృద్ధ దంపతులను హత్యచేశారు సమీప బంధువులు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- గుటెరస్ శాంతి యత్నం.. త్వరలో పుతిన్, జెలెన్స్కీతో భేటీ
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 26న రష్యాకు వెళ్లనున్న గుటెరస్.. ఏప్రిల్ 28న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఇరుదేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు.
- రిలయన్స్- ఫ్యూచర్ గ్రూప్ విలీన ఒప్పందం రద్దు
ఫ్యూచర్ గ్రూప్‌తో కుదిరిన విలీన ఒప్పందంపై సంచలన ప్రకటన చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అమెజాన్ అభ్యంతరం తెలపటం వల్ల సుదీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్న తరుణంలో విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఫ్యూచర్‌గ్రూప్ రుణదాతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
- సామ్ కొత్త మూవీ ట్రైలర్ రిలీజ్..'కేజీయఫ్ 2'పై చెర్రీ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్గా నటించిన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరోవైపు, కేజీయఫ్2 సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రశంసల జల్లు కురిపించారు.
- రెజ్లర్ రవి దహియాకు గోల్డ్.. పునియాకు సిల్వర్
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత కుస్తీవీరుడు రవికుమార్ దహియా సత్తా చాటాడు. రెజ్లింగ్ 57 కిలోల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో దహియా స్వర్ణ పతకం సాధించాడు. మరోవైపు.. 67 కేజీల విభాగంలో రజతం సాధించాడు బజరంగ్ పునియా.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM - ప్రధాన వార్తలు
.
7 PM

Last Updated : Apr 23, 2022, 7:27 PM IST