కశ్మీర్‌లోని గుల్మార్గ్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2020లో... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలికల రగ్బీ జట్టు పాల్గొంది. మన వాతావరణంలో ఆటను ప్రాక్టీస్ చేసినా.. టోర్నమెంట్ జరిగింది మాత్రం 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో. అయినా కూడా మన అమ్మాయిలు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.
'రాష్ట్రం తరఫు నుంచి మెుదటిసారి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో బాలికలు రగ్బీ ఆడారు. బిహార్, మధ్యప్రదేశ్ వంటి జట్లతో తలపడ్డారు. మంచులో ఆడినా.. మంచి ఆట తీరును కనబరిచారు. బలమైన ప్రత్యర్థులు జమ్ము కశ్మీర్, హరియాణా, మధ్యప్రదేశ్‌తో తలపడి, ప్రశంసాపూర్వక ప్రతిభను కనబరిచారు'
-రామాంజనేయులు, జట్టు కోచ్, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సెక్రటరీ
'మేము ప్రాక్టీస్ చేసిన కోర్టు, ఆడిన కోర్టు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి. ఈ రెండూ మంచి అనుభవాలనిచ్చాయి. మేము వేసుకున్న బూట్లు మంచులో ఆడేందుకు అంతగా సహకరించకున్నా సాధ్యమైనంత వరకూ ప్రదర్శన చేశాం' అని జట్టు తరఫును ఆడిన ఝాన్సీ తెలిపింది. తోటి జట్ల ఆటగాళ్లంతా తమకు మంచి స్నేహితులయ్యారని ఆంధ్రప్రదేశ్ రగ్బీ జట్టు నాయకురాలు హర్తా రెడ్డి చెప్పింది.
ఇదీ చదవండి: అమ్మాయిలు ఏడవద్దన్న బేడీ.. నెటిజన్ల ఫైర్