ETV Bharat / city

AP TEAM STUDY: కేరళలో బాధితులకు సులువుగా చికిత్స.. ఏపీ బృందం అధ్యయనం - కేరళలో ఏపీ బృందం అధ్యయనం

కేరళలో మన రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసింది. స్థానిక సంస్థలకు పెద్దపీట వేస్తే పాలనతోపాటు ఆరోగ్యపరంగానూ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కేరళ నిరూపిస్తోంది. అక్కడ ఇప్పటికీ ప్రతిరోజూ కొవిడ్‌ కేసులు వేలల్లో నమోదవుతున్నా.. పంచాయతీ స్థాయిలోనే మెజారిటీ బాధితులకు సులువుగా చికిత్స అందుతోంది.

AP team
AP team
author img

By

Published : Sep 3, 2021, 7:51 AM IST

స్థానిక సంస్థలకు పెద్దపీట వేస్తే పాలనతోపాటు ఆరోగ్యపరంగానూ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కేరళ నిరూపిస్తోంది. అక్కడ ఇప్పటికీ ప్రతిరోజూ కొవిడ్‌ కేసులు వేలల్లో నమోదవుతున్నా... పంచాయతీ స్థాయిలోనే మెజారిటీ బాధితులకు సులువుగా చికిత్స అందుతోంది. బాధితులూ ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ కొవిడ్‌కు నాలుగు అంచెల్లో చికిత్స అందుబాటులో ఉంది. ఈమేరకు కేరళలో మన రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసింది.

ఫ్యామిలీ క్లినిక్కులతో ముందడుగు

లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను పంచాయతీ కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. కేరళలో నలుగురు వైద్యులతో ఆసుపత్రులు (ఫ్యామిలీ క్లినిక్స్‌) నడుస్తున్నాయి. వీటి పర్యవేక్షణలో ప్రతి పంచాయతీలో ప్రత్యేకంగా 1,100 కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. తర్వాతి అంచెలోని 300 సెకôడ్‌లైన్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయి. అక్కడి నుంచి కేసుల తీవ్రతకు అనుగుణంగా ఫస్ట్‌లైన్‌, జిల్లా కేంద్ర ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు తరలిస్తున్నారు.

వైద్య బడ్జెట్‌లో నుంచి పంచాయతీలకు 30% నిధులు

‘రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌లో 30% నిధులు పంచాయతీలకు వెళ్తున్నాయి. ఫలితంగా కొవిడ్‌ అవసరాలకు తగినట్లు పంచాయతీలే నిధులను ఖర్చు చేస్తున్నాóు. సిబ్బంది నియామకాలనూ చేపడుతున్నాóు. దాంతో బాధితులకు సకల సౌకర్యాలు అందుతున్నాయి’ అని కమిటీ సభ్యులు, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌ వెల్లడించారు.

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు చాలా తక్కువ

కేరళలో కొవిడ్‌ బాధితులకు స్టెరాయిడ్స్‌ తక్కువగా వాడుతుండటంతో 106 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మన రాష్ట్రంలో సెప్టెంబరు 1 నాటికి ఈ కేసులు 4,889 వరకు రాగా 448 మంది మృతి చెందారని కమిటీలో సభ్యులు, ఏపీ వైద్య మండలి అధ్యక్షుడు సాంబశివారెడ్డి వెల్లడించారు.

డెల్టా వేరియంట్‌తోనే 80% కేసులు

కేరళలో 45% మందిలోనే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి. దీనివల్ల ఒకరి నుంచి పది మందికి వైరస్‌ వ్యాప్తి జరుగుతోంది. కొందరు ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ఇళ్లల్లో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే బయటకు వచ్చేస్తుండటంతో సమస్యగా ఉంది. కేరళలోని కేసుల్లో 80% వరకు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవే.- బాబు.ఎ, ఛైర్మన్‌, అధ్యయన కమిటీ, నోడల్‌ ఆఫీసర్‌ 104 కాల్‌ సెంటర్‌

ఇదీ చదవండి: Covid Vaccine: టీకాతో 'లాంగ్​ కొవిడ్'​ దూరం.. పనితీరు భేష్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.