గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల రాత పరీక్షల ప్రశ్నపత్రాలు అభ్యర్థులను బెంబేలెత్తించాయి. ఉద్యోగాల స్థాయికి మించి వచ్చిన ప్రశ్నాపత్రాలు వారిని ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రశ్నల సరళి గ్రూప్-1, గ్రూప్-2 స్థాయిలో ఉంది. ఏపీపీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక సంస్థల ఉద్యోగ ప్రకటనలకు తగ్గట్టు రెండు, మూడేళ్ల నుంచి సిద్ధమవుతున్న వారే ముందుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సచివాలయ ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాక పరీక్షలకు ఉన్న స్వల్ప వ్యవధిలోనే నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నవారు ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలున్నాయి. ప్రశ్నల స్థాయి ఎక్కువ ఉన్నందువల్ల ఉద్యోగ ఖాళీలు తగ్గట్టు అభ్యర్థులు ఎంపికకు పలు జిల్లాల్లో ఆయా విభాగాల్లో కనీస అర్హత మార్కులను తగ్గించవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ప్రశ్నల సరళి ఇలా....
భూతలం నుంచి చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు? ప్రింటర్ నాణ్యతను ఎలా కొలుస్తారు? సాగర తీరంలో చమురు వాయువుకు చెల్లించాల్సిన రాయల్టీని సంబంధిత రాష్ట్రానికి చెల్లించాలని ఏ షెడ్యూల్ కింద రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు? ఇలా ప్రశ్నలున్నాయి. మహిళా సాధికారత సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన సంఘటనలపై ప్రశ్నించారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కఠిన 'పరీక్ష'
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల రాత పరీక్షల ప్రశ్నపత్రాలు అభ్యర్థులన బెంబేలెత్తించాయి. కొన్ని ప్రశ్నలు గ్రూపు-1, గ్రూపు- 2 స్థాయిలో ఉన్నాయని అభ్యర్థులు వాపోయారు. వేగంగా జవాబులు చేయటంలో ఇబ్బందులు పడ్డామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.