పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా.. ఇప్పటికే ఈ నెల 29,30 తేదీల్లో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించిన ఎస్ఈసీ.. నేటి నుంచి మిగిలిన జిల్లాలకూ వెళ్లనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విజయవాడ నుంచి విశాఖ బయల్దేరనున్న నిమ్మగడ్డ... రెండున్నరకు అక్కడ్నుంచి శ్రీకాకుళం వెళ్తారు. సాయంత్రం నాలుగున్నరకు జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. 5 గంటల 45 నిమిషాలకు.. విజయనగరం బయల్దేరి.... రాత్రి 7 గంటలకు అక్కడి జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం రాత్రి ఎనిమిదన్నర గంటలకు విశాఖ బయల్దేరి... రాత్రికి అక్కడే బస చేస్తారు.
రేపటి షెడ్యూల్...
ఫిబ్రవరి 2 ఉదయం 9 గంటలకు.. విశాఖ జిల్లా అధికారులతో సమీక్షించి పదిన్నరకు ఎస్ఈసీ.. కాకినాడ బయల్దేరనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ నుంచి ఏలూరు బయల్దేరి.... రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. ఫిబ్రవరి 2 రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఏలూరు నుంచి విజయవాడ బయల్దేరతారు. 3,4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఫిబ్రవరి 3 సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు.... ఎస్ఈసీ విజయవాడ నుంచి బయల్దేరి 6 గంటల 45 నిమిషాలకు... తిరుపతిలో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీతో సమావేశమవుతారు. 4వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతి నుంచి నెల్లూరు వెళ్లి... 10 గంటలకు అక్కడి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు నుంచి ఒంగోలు బయల్దేరి... మధ్యాహ్నం 2 గంటలకు ప్రకాశం జిల్లా అధికారులతో సమావేశమవుతారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గుంటూరుకు బయల్దేరి... 6 గంటలకు గుంటూరు జిల్లా అధికారులతో భేటీ అవుతారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. ఎస్ఈసీ పర్యటన సందర్భంగా..... భద్రత సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
ఇదీ చదవండి