ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ - పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్

panchayat-elections
panchayat-elections
author img

By

Published : Jan 25, 2021, 2:43 PM IST

Updated : Jan 26, 2021, 6:43 AM IST

14:40 January 25

ఎస్​ఈసీ కీలక నిర్ణయం

ఎస్​ఈసీ కీలక నిర్ణయం
ఎస్​ఈసీ కీలక నిర్ణయం

పంచాయతీ ఎన్నికల షెడ్యూలులో రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని మార్పులు చేసింది. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో నిర్వహిస్తామని, తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతాయని ఎన్నికల సంఘం ఇది వరకు ప్రకటించి, ఆ మేరకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తొలి విడత ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవ్వాల్సి ఉండగా.. జిల్లాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయకపోవడంతో ఎక్కడా ఆ ప్రక్రియ జరగలేదు. దీంతో తొలి విడత ఎన్నికల్ని రద్దు చేసి ఎన్నికల సంఘం కొత్త తేదీ ప్రకటించింది. తొలి విడతలో ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలకు చివర్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక సవరించిన షెడ్యూల్‌ జారీచేశారు. దాని ప్రకారం.. 2, 3, 4 విడతల ఎన్నికలు ఆయా మండలాల్లోని పంచాయతీలకు గతంలో ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయి. ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఒకటో దశలో జరగాల్సిన ఎన్నికల్ని నాలుగో దశగా రీషెడ్యూల్‌ చేస్తున్నామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. రెండు, మూడు, నాలుగు దశల ఎన్నికల్ని.. ఒకటి, రెండు, మూడు దశలుగానూ, తొలి దశలో జరగాల్సిన ఎన్నికల్ని నాలుగో దశగానూ భావించాలని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. తొలిదశలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగాల్సిన మండలాల్లోని పంచాయతీలకు కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 21న జరుగుతాయని తెలిపారు.
తాజా నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో జరుగుతాయి. తొలుత ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మొదలవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయలేదని తమ దృష్టికి వచ్చినట్లు ఎస్‌ఈసీ పేర్కొన్నారు. తొలి దశ నామినేషన్ల స్వీకరణకు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిందని భావించి షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ, తాజా నోటిఫికేషన్‌ విడుదల చేశామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, రాజ్యాంగంలోని 343కె అధికరణ ప్రకారం ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొన్నారు. కొత్త షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 29న  ప్రారంభమవుతుంది. 13న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి, 17న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 6 నుంచి, 21న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇదీ చదవండి:  స్థానిక ఎన్నికలు యథావిధిగా జరగాల్సిందే: సుప్రీంకోర్టు

Last Updated : Jan 26, 2021, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.