లాక్డౌన్లో గృహహింస ఎదుర్కొంటున్న మహిళల రక్షణకు ఏపీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అన్ని జిల్లాల్లో 24 గంటలూ పనిచేసే వన్‌స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిపుణులతో వైద్య, ఆరోగ్య, మానసిక, సాంఘిక, న్యాయ సాయం అందించనున్నారు. పోలీసు సంరక్షణ, వసతి సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో బాధిత మహిళలకు వసతి, రక్షణ సౌకర్యాలు కల్పించనున్నారు. ఉమెన్ హెల్ప్‌లైన్ 181 నిరంతరాయంగా అందుబాటులో ఉండనుంది. వీటితో పాటు జిల్లాల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నంబర్లను విడుదల చేశారు.
జిల్లా | కాల్ చేయాల్సిన నంబర్లు |
శ్రీకాకుళం | 9110793708 |
విశాఖపట్నం | 6281641040 |
పశ్చిమ గోదావరి | 9701811846 |
గంటూరు | 9963190234 |
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు | 9848653821 |
కర్నూలు | 9701052497 |
అనంతపురం | 8008053408 |
విజయనగరం | 8501914624 |
తూర్పుగోదావరి | 9603231497 |
కృష్ణా | 9100079676 |
ప్రకాశం | 9490333797 |
చిత్తూరు | 9959776697 |
వైయస్ఆర్ కడప | 8897723899 |