ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఇంటర్ అపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం(ఐసీజేఎస్) అమలు, వినియోగంలో జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐసీజేఎస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అవార్డులు ప్రకటించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో డీజీపీ గౌతం సవాంగ్ అవార్డు అందుకున్నారు.
ప్రతిష్టాత్మకమైన అవార్డును ఏపీ పోలీస్ శాఖ దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత హర్షం వ్యక్తం చేశారు. కాగా ఐసీజేఎస్ అమలు, వినియోగంలో మహారాష్ట్ర మొదటి స్థానం, తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి.
ఇదీ చదవండి : నరకానికి నకలుగా కర్నూలు రోడ్లు