ETV Bharat / city

రిజిస్ట్రేషన్ ఉండదు.. ఏ రీచ్​ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చు: జి.కె. ద్వివేది - Jayaprakash Power Ventures gets sole sand mining rights in AP

నూతన ఇసుక విధానంలో రిజిస్ట్రేషన్ అవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ప్రజలు ఏ రీచ్ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు. కొత్త విధానంలో ప్రజలకు లబ్ధి జరుగుతుందని అన్నారు.

ap panchayat raj principal secretary gopal krishna dwivedi

author img

By

Published : Mar 22, 2021, 5:08 PM IST

Updated : Mar 23, 2021, 4:31 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరాను రుణాల్లో కూరుకుపోయిన ప్రైవేటు సంస్థకు అప్పగించారంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర గనుల శాఖ స్పందించింది. పూర్తి పారదర్శక విధానంలోనే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్​కు ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాల వంటి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపింది. నామినేషన్ ప్రాతిపదికన కానీ, రహస్య టెండర్ కానీ ఇవ్వలేదని గనుల శాఖ వివరించింది. ఇసుక విక్రయాలు పారదర్శకంగా ఉండాలనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారా ఈ బిడ్డింగ్ చేపట్టినట్టు తెలిపింది. ఎంఎస్​టీసీ సంస్థ ద్వారా మాత్రమే పారదర్శక బిడ్డింగ్ లో జయప్రకాశ్ వెంచర్స్ కు ఈ తవ్వకాల టెండర్ దక్కిందని.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

విమర్శలు అవాస్తవం....

'ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ఎంపికైన గుత్తేదారు సంస్థ జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు అనుభవం లేదని, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని, ఆ సంస్థకు ఇసుక ద్వారా రూ.2వేల కోట్లు మిగులుతుందని ఆరోపణలు చేశారు. ఇసుక టన్ను ధర రూ.475గా నిర్ణయించాం. ఏటా 2కోట్ల టన్నుల విక్రయాలతో రూ.950-965 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో రూ.765 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ విధంగా మిగిలిన మొత్తంలో ప్రతి టన్నుకు నిర్వహణ ఛార్జీల కింద రూ.64 తీసేయగా మిగిలేది రూ.36 మాత్రమే. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెడితే ఆ గుత్తేదారు సంస్థకు ఏటా రూ.72 కోట్లు మిగులుతుంది.' - రాష్ట్ర పంచాయతీరాజ్‌, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి జీకే ద్వివేది

రీచ్​ల సంఖ్య పెంపు....

బిడ్డింగ్ దక్కించుకున్న సంస్థ.. సంబంధిత యంత్రాలు, మానవ వనరుల్ని ఈ రీచ్​ల వద్ద నియమించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల టన్నుల ఇసుక వస్తుందని గణాంకాలు చెబుతున్నాయని.. ఇందులో ప్రభుత్వానికి దాదాపు 750 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్ లలోనూ ఒకే రకమైన ధర ఉంటుందని.. ప్రతీ టన్నుకు 475 రూపాయలతో పాటు రవాణా వ్యయం అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65 ఇసుక రీచ్ లు ఉన్నాయని త్వరలోనే 300 నుంచి 400 రీచ్ లకు పెంచుతామన్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ లేకుండా నేరుగా ఇసుక కొనుగోళ్లు ఉంటాయని స్పష్టం చేశారు. టెండర్‌ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీతో జనవరి 4న ఒప్పందం జరిగిందన్నారు.

పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జి.కె.ద్వివేది

'ఏ రీచ్​ నుంచైనా ప్రజలు ఇసుక తీసుకెళ్లవచ్చు. సొంత వాహనాల్లో తరలించవచ్చు. రీచ్​లనూ కూడా ఎంపిక చేసుకోవచ్చు. వాహన సదుపాయం కల్గించే చర్యలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే 14500 కి ఫిర్యాదు చేయవచ్చు. ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. డోర్ డెలివరీ సదుపాయం ఇక ఉండదు'- రాష్ట్ర పంచాయతీరాజ్‌, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి జీకే ద్వివేది

ఇదీ చదవండి:

కమల్​ నోట హంగ్​ మాట- ప్రజలకు కీలక సూచన

Last Updated : Mar 23, 2021, 4:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.