AP Ministers condolence to Krishnam raju: కృష్ణంరాజు భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం నివాళులు అర్పించింది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేంద్రమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.
రెబల్‌స్టార్‌గా పేరుగాంచినా...కృష్ణంరాజు ఎంతో సౌమ్యుడని మంత్రి రోజా అన్నారు. హైదారాబాద్‌లో ఆయన భౌతికకాయానికి రోజా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిత్రరంగంలోనూ, రాజకీయాల్లోనూ ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు. కృష్ణంరాజుతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి: