ETV Bharat / city

కరోనాపై పోరులో మేము సైతం - కరోనాపై పోరులో మేము సైతం న్యూస్

కరోనా పై పోరుకు దీపాలు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఒకే తాటిపైకి వచ్చి కరోనా బాధితులకు తాము అండగా ఉన్నామంటూ దీపాలు వెలిగించారు. గవర్నర్ బిశ్వభూషణ్ , తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా, పోలీసు ఉన్నతాధికారులు దీపాలు వెలిగించి తమ సంఘీభావం తెలిపారు.

ap-lighting-for-corona
ap-lighting-for-corona
author img

By

Published : Apr 5, 2020, 10:57 PM IST

కరోనాపై పోరులో మేము సైతం

కరోనాపై పోరులో భాగంగా జ్యోతిప్రజ్వలన చేశారు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్. ప్రధాని పిలుపుకు ప్రతి స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంతి వెలుగులతో కరోనా చీకటికి ముగింపు ఖాయమన్నారు. దేశాన్ని రక్షించునే క్రమంలో రాష్ట్ర ప్రజలంతా ఐక్యతను చాటడం ఆనందంగా ఉందన్నారు.

హైదరాబాద్‌ లో.. కుటుంబసభ్యులతో కలిసి దీపప్రజ్వలన చేశారు తెదేపా అధినేత చంద్రబాబు. ప్రధాని పిలుపునకు మద్దతుగా దీపాలు వెలిగించారు.

విజయవాడలో పోలీసులు దీపాలు వెలిగించారు. ఏఆర్‌ గ్రౌండ్స్‌లో సిటీ పోలీస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించారు. కార్యక్రమంలో పాల్గొ న్న సీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులోని తన నివాసంలో దీపాలు వెలిగించారు. లైట్లు ఆపేసి.. 9 నిముషాల పాటు కొవ్వొత్తులు వెలిగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.