రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమాఖ్య చైర్మన్ తీరును ఆక్షేపిస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఫెడరేషన్ పేరుతో చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో చులకన భావన ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీం తీర్పును గౌరవిస్తున్నామన్న ఆయన... కొంతమంది తమకు రాజకీయ పార్టీలను ఆపాదిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ప్రాణాల కోసమే తాము పలు వ్యాఖ్యలు చేశామని స్పష్టం చేశారు. పెద్ద మనసు చేసుకుని ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు.
' ఎన్నికల విషయంలో ఏపీ జేఏసీ ఎక్కడా కోర్టుకు వెళ్లలేదు. పెద్ద మనసు చేసుకుని ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇప్పించాలి. అవసరమైతే ఎన్నికల మిగతా విడతలు రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నాం. వ్యాక్సిన్ లేకుండా ముందుకి వెళితే ఏమి జరిగినా రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వామే బాధ్యత వహించాలి'- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్
ఏపీ జేఎసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏడు తీర్మానాలను ఆమోదించినట్లు వివరించారు. మార్చి31లోగా పీఆర్సీ నివేదికను ఆమోదించాలని... ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరారు. పలువురు ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులు కూడా రావట్లేదన్నారు. ఈహెచ్ఎస్ కార్డులు పూర్తిస్థాయిలో అమలు కావట్లేదన్న బొప్పరాజు... రీఎంబర్స్‌మెంట్‌ను రూ.5 లక్షలకు పెంచాలన్నారు.
ఇదీ చదవండి