ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ముఖ్య కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షలకు జనరల్ కేటగిరీలో మొత్తం 3 లక్షల 37 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. దీని కోసం 905 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్ష ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. నూటికి నూరు శాతం మార్కులు వచ్చిన విద్యార్థుల సమాధాన పత్రాలు పరీశీలించే అధికారం వీరికి ఉంటుందన్నారు. పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం... నేటి నుంచి అధికారిక వెబ్ సైట్, టోల్ ఫ్రీ, వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించండి'