ETV Bharat / city

Corona cases: కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచార‌ణ - కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచార‌ణ

కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచార‌ణ జరిగింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కేసులు పెర‌గ‌డంపై హైకోర్టు ఆరా తీసింది. టీచర్లు, న్యాయ‌వాదుల‌కు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నంచింది. సెప్టెంబ‌ర్ 8 నాటికి స్టేట‌స్ రిపోర్టు దాఖ‌లు చేయాల‌ని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాల‌ని తెలిపింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించింది.

ap-hight-court
ap-hight-court
author img

By

Published : Aug 31, 2021, 2:13 PM IST

Updated : Sep 1, 2021, 8:28 AM IST

కొవిడ్ నిబంధనలను ప్రజలు తప్పక పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంచేసింది. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకున్న చర్యల వివరాల్ని తమ ముందు ఉంచాలని పేర్కొంది. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటును పూర్తి చేయాలని ఆదేశించింది. మూడో దశ వ్యాప్తిపై నిపుణులు హెచ్చరిస్తున్నందున.. మరిన్ని జాగ్రత్తలు వహించాలని తెలిపింది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయని నిర్లిప్తత వద్దని హెచ్చరించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి , చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కట్టడి కోసం తీసుకున్న చర్యల వివరాల్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదే శాలిచ్చింది.

కార్పోరేట్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్ , కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పాత్రికేయులు తోట సురేశ్ బాబు మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా జరిగిన విచారణలో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలు కొవిడను తేలిగ్గా తీసుకుంటున్నారన్నారు. మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను ప్రజలందరు పాటించే విధంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలని కోరారు. రాష్ట్రానికి 28 ఆక్సిజన్ ప్లాంట్లు కేటాయించగా ప్రస్తుతం 18 పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తరపున ఏఎస్ జీ హరినాథ్ వాదించారు. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ .. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ప్రారంభించామన్నారు. కళాశాలలు ప్రారంభమైనందున గ్రూప్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామన్నారు. 4137 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా 490 క్రియాశీలకంగా ఉన్నాయన్నారు. రోజుకు 15 నూతన కేసులు మాత్రమే నమోదవుతున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: ఆ 40 అంతస్తుల భవనాలు రెండింటినీ కూల్చేయండి: సుప్రీం ఆదేశం

Last Updated : Sep 1, 2021, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.