ETV Bharat / city

'ఆంగ్లం రాని కారణంగానే ఉన్నతస్థాయికి వెళ్లలేకపోయా' - తెలుగుపై జస్టిస్​ ఈశ్వర్య వ్యాఖ్యలు

వెనుకబడిన తరగతుల వారు ఆంగ్లమాధ్యమంలో విద్య నేర్చుకోకూడదనే ఉద్దేశంతో కొందరు వ్యతిరేకిస్తున్నారని... ఏపీ ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆరోపించారు. తెలుగు భాష కంటే ఆంగ్లం నేర్చుకోవడం సులభమన్నారు. అంగ్లంలో అభ్యసించని కారణంగా హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి కంటే ఉన్నతస్థాయికి వెళ్లలేకపోయానని పేర్కొన్నారు.

AP Higher Education Supervision and Regulatory Commission   Chairman Justice V eshwaraiah comments on telugu
తెలుగుపై జస్టిస్ వి.ఈశ్వరయ్య వ్యాఖ్యలు
author img

By

Published : Dec 28, 2019, 7:43 PM IST

తెలుగు భాష కంటే ఆంగ్లం నేర్చుకోవడం సులభమని ఏపీ ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య వివరించారు. ఆంగ్లంలో 'A' అక్షరం రాయటం కంటే తెలుగులో 'అ' అనే అక్షరం రాయటం కష్టమన్నారు. వెనుకబడిన తరగతుల వారు ఆంగ్లమాధ్యమంలో విద్య నేర్చుకోకూడదనే ఉద్దేశంతో కొందరు వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రాథమిక తరగతుల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే ఉన్నత విద్యలో రాణించటం సులభమవుతుందన్నారు.

తాను వ్యక్తిగతంగా ఈ ఇబ్బందిని ఎదుర్కోన్నానని... అంగ్లంలో అభ్యసించని కారణంగా హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి కంటే ఉన్నతస్థాయికి వెళ్లలేకపోయానని జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. కేవలం మాధ్యమం కారణంగానే సమాజం రెండుగా విడిపోయిందన్నారు. కోర్టుల్లో, పాలనా వ్యవహారాలు ఆంగ్లంలోనే జరుగుతున్నాయని... అలాంటప్పుడు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు.

తెలుగుపై జస్టిస్ వి.ఈశ్వరయ్య వ్యాఖ్యలు

ఇదీ చదవండి

సీఎం జగన్​కు విశాఖలో ఘనస్వాగతం

Intro:Ap_Vsp_63_14_Fancy_Dress_Games_Compitition_Av_AP10150

Body:బాలల దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఆల్వార్ దాస్ పాఠశాలలో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రస్ పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వస్త్రాలంకరణ చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరి మన్ననలు పొందారు అంతేకాకుండా ఆయా రాష్ట్రాల వేషధారణలతో వారి సంస్కృతి సంప్రదాయాలను అందరికీ వివరించారు జాతి సమైక్యతను పెంపొందించేందుకు ఉద్దేశంతో ఇలాంటి పోటీలు నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన పలు సరదా ఆటల పోటీలు అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు పాఠశాల అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని ఆటలు ఆడారు. ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.