ఏపీ హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి రామకృష్ణ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ వాదనలు వినిపిస్తూ...సర్వీస్ నిబంధనల ప్రకారం న్యాయమూర్తి మీడియాతో మాట్లాడుకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి రామకృష్ణ రోజూ మీడియాతో మాట్లాడుతున్నారని పిటిషన్ వాదించారు. ప్రస్తుత పిటిషన్‌కు జడ్జి రామకృష్ణకు సంబంధం లేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, జడ్జి ఈశ్వరయ్యకు సంబంధం ఉందని రామకృష్ణ తరపు న్యాయవాది వాదించారు. రామకృష్ణ తరపు న్యాయవాది లేవనెత్తిన అంశం వాస్తవం కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకే పిటిషన్ వేశారని రామకృష్ణ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సంబంధిత ఆడియో టేపులు జత చేశామన్న ఆయన.... న్యాయవ్యవస్థపై జరుగుతున్న కుట్రలను చేధించేందుకు తాము ఇంప్లీడ్ అవుతున్నామని వివరించారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్న జడ్జి రామకృష్ణ తరఫు న్యాయవాది కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి
'హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించేలా ఆదేశాలివ్వండి'